ఈరోజు మధ్యాహ్నం గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 2019కి ముందు వరకు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలే అధికారంలో ఉన్నాయని అన్నారు.1978లో కాంగ్రెస్ పార్టీ( Congress party ) ఎమ్మెల్యేగా చంద్రబాబు రాజకీయ జీవితం ప్రారంభించారని, అదే కాంగ్రెస్ పార్టీలు ఐదు సంవత్సరాలు మంత్రిగా పనిచేశారని, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు భార్యతో పాటు ఎన్టీ రామారావు దగ్గరకు వెళ్లి కాళ్లు పట్టుకుని తెలుగుదేశం పార్టీలో చేరాడని అన్నారు.1978 నుండి 40 సంవత్సరాల ఇండస్ట్రీ కలిగిన చంద్రబాబు ఈ రాష్ట్ర రాజకీయాలలో చంద్రబాబు నాయుడు పాత్ర కీలకంగా ఉండేదని నాని అన్నారు.40 సంవత్సరాలు కాంగ్రెస్, తెలుగుదేశం ( Congress, Telugu Desam )పార్టీలో అధికారంలో ఉన్న చంద్రబాబు ఈ ప్రాజెక్టులను ఆనాడు ఎందుకు కట్టలేకపోయారని నాని ప్రశ్నించారు.కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి పులిచింతల ప్రాజెక్టును ఎందుకు నిర్మించలేకపోయాడని, తన సొంత జిల్లాలో గాలేరు, నగరి కాలువలను ఎందుకు త్రవలేకపోయాడని నాని ప్రశ్నించారు.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు చెబితే చంద్రబాబు రాత్రిపూట భయపడుతున్నాడని, 70 సంవత్సరాలు వయసు కలిగిన పెద్దిరెడ్డి నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేస్తారని, కుప్పంలో కూడా పెద్దిరెడ్డి ఏదో చేస్తారనే భయంతో చంద్రబాబు పెద్దిరెడ్డిని బ్రతిమిలాడుకుంటున్నారని నాని అన్నారు.కుప్పంలో చంద్రబాబును ఓడించి రాష్ట్రం నుంచి తరిమికొట్టేంతవరకు పెద్దిరెడ్డి నిద్రపోరని అన్నారు.2024 ఎన్నికలలో చంద్రబాబుకు రాజకీయ చరమగీతం పాడేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని నాని అన్నారు.పవన్ కళ్యాణ్ మూడో విడత ప్రచారం రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, తాను పవన్ కళ్యాణ్ను కలిసేందుకు అనేకమార్లు ప్రయత్నించినా అపాయింట్మెంట్ ఇవ్వలేదని, చంద్రబాబు నాయుడు ఆత్మీయులంతా పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేసేవారని, చంద్రబాబు ఆత్మీయులంతా ఏదో లబ్ధి పొందుదామని చంద్రబాబు నాయుడు వెనుక ఉన్నారని, ప్రస్తుతం చంద్రబాబు పదవిలో లేకపోవడంతో వాళ్లంతా చతికిల పడ్డారని అన్నారు.చంద్రబాబు నాయుడు కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా కాలేడని, అందుకే పవన్ కళ్యాణ్ ను కలుపుకుంటే కనీసం అధికారంలోకి రావడం గానీ ప్రతిపక్ష హోదాగాని వస్తుందనే ఆశతో ఉన్నారని ఇది పవన్ కళ్యాణ్ గమనించాలని నాని అన్నారు.
చంద్రబాబు అవసరానికి వాడుకుని వదిలేయటం అతని రక్తంలోనే ఉందని, తెలుగుదేశం పార్టీని స్థాపించి నలుదిక్కులా విస్తరింపజేసిన ఎన్టీ రామారావు లాంటి వ్యక్తినే చంద్రబాబు ఆ పార్టీని, ముఖ్యమంత్రి పదవిని లాక్కొని ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని అన్నారు.విప్లవ నాయకుడు గద్దర్ మృతికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు కొడాలి నాని తెలిపారు.
గద్దర్ తో తనకు ఎంతో అనుబంధం ఉందని, 2009లో గన్నవరం నియోజకవర్గo ఉంగుటూరు మండలంలో ఉంగుటూరు గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహ ప్రారంభోత్సవానికి వంశి, నేను గద్దర్ ను తీసుకొచ్చామని, ఆయనతో కలిసి ప్రయాణం చేశానని, ఆయన మరణం తనకు తీవ్ర లోటు కలిగిస్తుందని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు నాని తెలిపారు