ఏపీ నూతన గవర్నర్ తో భేటీ అయిన చంద్రబాబు..!!

టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ గా నియమితులైన అబ్దుల్ నజీర్ నీ ఏపీ రాజ్ భవన్ లో కలిశారు.

దాదాపు 40 నిమిషాల పాటు చంద్రబాబు.

గవర్నర్ తో సమావేశమయ్యారు.ఇదే సమావేశంలో యనమల రామకృష్ణుడు, నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, నిమ్మకాయల చిన్న రాజప్ప, కొనకాల సత్యనారాయణ, ఏలూరి సాంబశివరావు వంటి సీనియర్ నేతలు ఉన్నారు.

వీరందరినీ గవర్నర్ కి చంద్రబాబు పరిచయం చేయడం జరిగింది.రాష్ట్రంలో తాజా పరిస్థితులపై ఆయనతో చర్చించి కొన్ని విషయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

Chandrababu Met The New Governor Of Ap Abdul Nazeer Details, Chandrababu, Ap Gov

ఇదిలా ఉంటే రేపు రాష్ట్ర నూతన గవర్నర్ గా అబ్దుల్ నజీర్ బాధ్యతలు చేపట్టనున్నారు.ఈ క్రమంలో గవర్నర్ ప్రమాణ స్వీకారానికి రాజ్ భవన్ వర్గాలు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత మూడో గవర్నర్ గా అబ్దుల్ నజీర్ పదవి చేపట్టనున్నారు.

Advertisement
Chandrababu Met The New Governor Of AP Abdul Nazeer Details, Chandrababu, AP Gov

కర్ణాటకకు చెందిన సయ్యద్ అబ్దుల్ నజీర్ సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేసి జనవరిలో రిటైర్ అయ్యారు.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయకుండానే సుప్రీంకోర్టు పదోన్నతి పొందిన మూడో న్యాయమూర్తిగా నజీర్ కి మంచి గుర్తింపు ఉంది.

సుప్రీంకోర్టులో పలు కీలకమైన కేసులలో న్యాయమూర్తిగా ఆయన ఇచ్చిన తీర్పులు దేశంలోనే సంచలనం సృష్టించాయి.

Advertisement

తాజా వార్తలు