ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు( Atchannaidu ) సంచలన వ్యాఖ్యలు చేశారు.జైల్లో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బట్టి చూస్తే ఆయనకు ప్రాణహాని ఉందని ఆయన అరెస్టు వెనక పెద్ద కుట్ర దాగుందని ఆరోపించారు.
విశాఖలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో “న్యాయానికి సంకెళ్లు” కార్యక్రమంలో అచ్చెన్నాయుడు పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరంతరం ప్రజల మధ్య ఉండే వ్యక్తిని అర్ధరాత్రి అరెస్టు చేశారు.
ఆయనను అరెస్టు చేసి 37 రోజులైనా గాని ఒక్క రూపాయి అవినీతి జరిగిందని నిరూపించలేకపోయారు.కనీసం ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారు.
చంద్రబాబు అరెస్ట్ వెనుక పెద్ద కుట్ర ఉంది.జైలులో ఆయనకు ప్రాణహాని ఉందనే అనుమానాలు.
బలపడుతున్నాయి.
ప్రతి ఒక్కరూ చంద్రబాబు అరెస్ట్( Chandrababu arrest ) నీ ఖండిస్తున్నారు.
చంద్రబాబు ఆరోగ్యం చాలా ప్రమాదకరంగా ఉంది.అయినా ఇంకా గదిలో ఏసీ పెట్టలేదు.
మరోపక్క ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు చెప్పకుండా సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) ఎలా చెబుతారు అని అచ్చెన్నాయుడు నిలదీశారు.ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని సాగనంపే సమయం దగ్గర పడిందని చెప్పుకొచ్చారు.
చంద్రబాబుకి ఏదైనా హాని జరిగితే పూర్తి బాధ్యత జగనే వహించాలని అన్నారు.చంద్రబాబుకి మెరుగైన వైద్యం అందించాలి.
ఎయిమ్స్ లో చికిత్స ఇప్పించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.నేడు తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా “న్యాయానికి సంకెళ్లు” కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.