ఆంధ్ర, తెలంగాణ విభజన తర్వాత పూర్తిగా తెలంగాణలో టిడిపిని పక్కన పెట్టేశారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు .పూర్తిగా ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టారు.
ఫలితంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలహీనమవుతూ వచ్చింది.ఆ పార్టీలో కీలక నాయకులంతా ఒక్కొక్కరుగా ఇతర పార్టీలో చేరిపోయారు.
తెలంగాణలో పేరుకే పార్టీ తప్ప పెద్దగా ఉనికి లేని పరిస్థితి ఉంది.ఏ ఎన్నికల్లోను టిడిపి ప్రభావం చూపించలేకపోతోంది.
అసలు పోటీకి దింపేందుకు చంద్రబాబు సైతం అంతగా ఆసక్తి చూపించడం లేదు.అప్పుడప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, తెలంగాణలో టిడిపిని బలోపేతం ఏ విధంగా చేయబోతున్నామనే విషయంపైనే బాబు తెలంగాణ టిడిపి నాయకులతో చర్చిస్తూ వచ్చేవారు. తెలంగాణ టిడిపి అధ్యక్షుడుగా ఉన్న ఎల్ రమణ టిఆర్ఎస్ లో చేరిపోవడం, ఎమ్మెల్సీ కావడం వంటి వ్యవహారాల తర్వాత తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా బక్కాని నరసింహులను నియమించారు.ఆయన హయాంలోనూ పార్టీ అంతగా పుంజుకోకపోవడంతో, ఆయన స్థానంలో బీసీ సామాజిక వర్గంలో మంచిపట్టున్న ఆర్థిక బలవంతుడైన కాశాని జ్ఞానేశ్వర్ ను తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా బాబు నియమించారు.
ఇక ఆయన ఆధ్వర్యంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు బాబు చెప్పారు.కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
దివంగత ప్రధాని పీవీ నరసింహారావు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలను ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసింది తానేనని , ఐటీ తో రైతు బిడ్డ కంప్యూటర్ పట్టుకునేలా చేశానని చంద్రబాబు అన్నారు.

ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ తాను తీసుకొచ్చిన సంస్కరణలను ప్రణాళికలను అమలు చేశారంటూ చంద్రబాబు చెప్పారు.అలాగే తన విజన్ 2020ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిందని ఏపీలో కూడా 2029 విజన్ రూపొందించాలని కానీ జగన్ ప్రభుత్వం అభివృద్ధిని ధ్వంసం చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని చంద్రబాబు విమర్శించారు.ఇదిలా ఉంటే ఇప్పుడు తను ప్రాణాలతో కేసీఆర్ కొనసాగిస్తున్నారంటూ బాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి.2014లో తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.అయితే ఓటుకు నోటు కేసు వ్యవహారం తెరపైకి రావడంతో పూర్తిగా తెలంగాణలో టిడిపిని వదిలిపెట్టి చంద్రబాబు ఏపీ పైనే దృష్టి సారించారు.
అప్పటి నుంచి కెసిఆర్ విషయంలో బాబు ఆచితూచి వ్యవహరిస్తూ వస్తున్నారు.ఎక్కడా ఎటువంటి కామెంట్లు చేయడం లేదు. అయితే ఇప్పుడు తన ప్రణాళికలను కేసీఆర్ అమలు చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై కేసిఆర్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.
.






