తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు “ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి” పర్యటనలో భాగంగా నేడు చిత్తూరు జిల్లా పుంగనూరులో( Punganuru ) పర్యటిస్తున్నారు.చంద్రబాబును( Chandrababu ) అడ్డుకునేందుకు వైసీపీ నేతలు దాడులకు పాల్పడటం జరిగింది.
పర్యటనలో భాగంగా చంద్రబాబు కాన్వాయ్ వెళ్ళకుండా రహదారికి అడ్డంగా లారీని అడ్డుపెట్టారు.ఈ పరిణామంతో లారీని అడ్డు తొలగించాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనలకు దిగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
ఈ క్రమంలో పోలీస్ వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం జరిగింది.ఈ పరిణామంతో ఆగ్రహించిన పోలీసులు టీయర్ గ్యాస్ ప్రయోగించి గాల్లోకి కాల్పులు జరిపారు.
ఇదే సమయంలో చంద్రబాబుకు పుంగనూరు పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు.దీంతో పోలీసులకు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.ఇక ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు( TDP ) ప్రయాణిస్తున్న వాహనాలపై సైతం రాలదాడి జరగడంతో దాదాపు 20 వాహనాల అద్దాలు ధ్వంసం అయినట్లు సమాచారం.తెలుగుదేశం పార్టీ నేతలు ఏర్పాటు చేసిన బ్యానర్లను సైతం వైసీపీ కార్యకర్తలు చించేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ ఘర్షణ వాతావరణాన్ని నిలువరించేందుకు ప్రయత్నించిన పోలీసులపై కూడా దాడులు జరుగుతూ ఉండటంతో.
చంద్రబాబు పుంగనూరు పర్యటన రణరంగంగా మారింది.పరిస్థితి ఇలా ఉండగా పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతూ ఉండటంతో చంద్రబాబు ఒక్కసారిగా సీరియస్ అయ్యారు.డీఎస్పీ తన యూనిఫామ్ తీసేయాలి.
బాంబులకే భయపడలేదు.? రాళ్లకు భయపడతానా.? ధైర్యం ఉంటే రండి చూసుకుందాం.పులివెందులకే( Pulivendula ) వెళ్లాను.
ఇక్కడికి రాకూడదా.? నేను చిత్తూరులోనే పుట్టా.పోలీసులు అండతో వైసిపి నేతలు రాజకీయం చేస్తున్నారు.ఎవరి జోలికి వెళ్ళము.మా జోలికి వస్తే ఊరుకోం.పుంగునూరు వెళ్తున్న అక్కడ పుడింగి సంగతి తేలుస్తా.
అంటూ చంద్రబాబు మండిపడ్డారు.