కుప్పం లో కొత్త నేతను ఎంచుకున్న బాబు ! అన్నీ ఆయనకే ? 

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు వైసిపి ( YCP ) అనేక వ్యూహాలు రచిస్తూ ఉండడం, టిడిపికి ( TDP ) గట్టి పట్టు ఉన్న నియోజకవర్గాలను టార్గెట్ చేసుకుని అక్కడ పార్టీని బలహీనం చేసే విధంగా వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తుండడం వంటివన్నీ లెక్కలు వేసుకుంటున్న బాబు, అక్కడ వైసిపికి ఛాన్స్ దక్కకుండా వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

 Chandrababu Gives Kuppam Tdp Responsibilities To Mlc Kancharla Srikanth Details,-TeluguStop.com

ఇక 2024 ఎన్నికల్లో తనను ఓడించేందుకు కుప్పం నియోజకవర్గాన్ని( Kuppam ) టార్గెట్ చేసుకోవడం,

ప్రస్తుత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి టీడీపీలో కీలక నాయకులందరినీ వైసీపీ వైపు తిప్పుకోవడం, అభివృద్ధి, సంక్షేమ పథకాల పేరుతో ప్రజల దృష్టిని ఆకర్షించే విధంగా ప్రయత్నించడం, తనను ఓడించేందుకు అన్ని రకాల వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ ఉండడంతో, ఎట్టి పరిస్థితుల్లోనైనా  ఇక్కడ భారీ మెజార్టీతో గెలిచి తన సత్తా చాటుకోవాలనే లక్ష్యంతో చంద్రబాబు ఉన్నారు.

Telugu Ap Cm Jagan, Ap, Kuppam, Mlckancharla, Telugudesam, Ysrcp-Politics

దీనిలో భాగంగానే కుప్పం నియోజకవర్గ ఎన్నికల బాధ్యతలను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కు అప్పగించారు.ఇక పూర్తిస్థాయిలో శ్రీకాంత్ నియోజకవర్గ పార్టీ బాధ్యతలను నిర్వహించనున్నారు.ఇకపై నియోజకవర్గంలోని టిడిపి నాయకులంతా శ్రీకాంత్ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలి అని, ఇటీవల చంద్రబాబు టెలికాన్సిడెన్స్ లో స్పష్టం చేశారు.

దీంతో ఇక్కడ చంద్రబాబు పిఏ మనోహర్,  మాజీ ఎమ్మెల్సీ గౌరవాని శ్రీనివాసులు వంటి వారి ఆధ్వర్యంలో సమన్వయ కమిటీని నియమించారు.అయినా వీరిద్దరి పాత్ర నామ మాత్రమే .పూర్తిగా కంచర్ల శ్రీకాంత్ కే బాధ్యతలను అప్పగించారు.

Telugu Ap Cm Jagan, Ap, Kuppam, Mlckancharla, Telugudesam, Ysrcp-Politics

కంచర్ల శ్రీకాంత్ రాజకీయ వ్యూహాలపై చంద్రబాబుకు నమ్మకం కుదరడం , ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి నుంచి గట్టి పోటీ ఎదురైనా, తగిన వ్యూహాలతో శ్రీకాంత్ ముందుకు వెళ్లి సక్సెస్ కావడం వంటివి చంద్రబాబును బాగా ఆకట్టుకున్నాయట.అందుకే కీలకమైన ఈ కుప్పం నియోజకవర్గంలో బాధ్యతలను సీనియర్లకు కాకుండా, కంచర్ల శ్రీకాంత్ కు చంద్రబాబు అప్పగించారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube