పెనమలూరు నియోజకవర్గంలో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారెంటీ యాత్ర ముగింపు సందర్భంగా ఉయ్యూరు సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో దేవినేని ఉమామహేశ్వరరావు( Devineni Uma Maheswara Rao ) మాట్లాడుతూ.రాష్ట్రంలో అవినీతి,హత్య రాజకీయాలు నడుస్తున్నాయని.
ప్రజల సంక్షేమం గాలికొదిలి అక్రమార్జనే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి( CM jagan ) పరిపాలిస్తున్నాడని వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశాన్ని గెలిపించి వైసీపీ కి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ( Panchumarti Anuradha ) మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డికి పరిపాలన చేతకాదని చేతకాని వాడు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం పరిస్థితి ఏమిటనేది కళ్ళారా చూస్తున్నామని విమర్శించారు.
స్థానిక ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి పై మండిపడ్డ బోడే…పార్థసారధి ఇంటిపేరు కొలుసు కాదని కాసుల పార్థసారధి అని ఎద్దేవా చేశారు.ప్రతి పనిలోనూ కమిషన్ భూ దందాలతో నియోజకవర్గ అభివృద్ధి పట్టక అక్రమ సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్నారని విమర్శించారు .తాను అవినీతి చేయలేదని తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రమాణం చేయగలరా అని బోడే సవాల్ విసిరారు.







