టీడీపీ అధినేత చంద్రబాబు రేపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లనున్నారు.సీఎం జగన్ పాలనను విమర్శిస్తూ ‘ ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అంటూ టీడీపీ ఓ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా రేపటి నుంచి మూడు రోజులపాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నిర్వహించనున్నారని తెలుస్తోంది.ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరుకానున్నారు.
చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.కాగా పెద్దాపురం, జగ్గంపేటతో పాటు అనపర్తి నియోజకవర్గాల్లో ఆయన పర్యటించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించనున్నారు.