ఎన్నో సమస్యలను తనదైన వ్యూహాలతో పరిష్కరించిన తెలుగుదేశం అధినేత, సీఎం చంద్రబాబుకు సొంత పార్టీ ఎంపీలే తలనొప్పిగా మారారు.రోజురోజుకీ వారి వ్యవహార శైలి తీసికట్టు నాగంబొట్టులా మారిపోతోందని ఆయన భావిస్తున్నారట.
ప్రజలకు చేరువకాకపోవడంతో పాటు సొంత వ్యాపారాలు, సొంత ఎజెండాతో ముందుకు వెళుతుండ టంతో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారట.ముఖ్యంగా నలుగురు ఎంపీల వల్ల పార్టీకి మూడేళ్లలో ఎటువంటి ప్రయోజనం లేదని ఆయన భావిస్తున్నారట.
వీరు స్వంత వ్యాపారాల వృద్ధి కోసమే పరితపిస్తున్నారని, ప్రజా సమస్యలకు అసలు ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది ఆయనత తీవ్రంగా అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారట.
గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన గల్లా జయదేవ్ పనితీరు నిరాశాజనకంగా ఉందట.
చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన్ను గుంటూరు జిల్లా నుంచి పోటీ చేసే అవకాశం కల్పించి గెలిపిస్తే అక్కడి ప్రజలకు చాలా దూరమయ్యారనే వార్తలు వస్తున్నాయి.నియోజకవర్గంపై పూర్తిస్థాయి పట్టుకోల్పోయారని సొంత పార్టీకి చెందిన నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.
ఎంపీగా ఎన్నుకుంటే జిల్లాకు భారీస్థాయిలో పరిశ్రమలు తెస్తారని, జిల్లాలోని నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపిస్తారని చాలా మంది ఆశించారు.కానీ ఆయన సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, వ్యాపారానికే ఎక్కువ సమయం ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
మరో ఎంపీ కేశినేని నాని వ్యవహారం కూడా పార్టీకి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.ట్రావెల్స్ వ్యవహారంలో రవాణాశాఖ కమిషనర్ సిబ్బందిపై దాడి చేయటం, అన్యాపదేశంగా ప్రభుత్వ వ్యవహారాలపై కామెంట్లు చేయటం వంటి చర్యలతో చంద్రబాబు గుర్రుగా ఉన్నారట.
వచ్చే ఎన్నికల్లో తనకు సీటు కేటాయించకుండా వేరే వారికి సీటు ఇస్తారనే ఆందోళన నానిలో ఉందని అందుకే ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయన అంటీముట్టనట్లువ్యవహరిస్తున్నారనే మాట వినిపిస్తోంది.రాజమండ్రి ఎంపీ మాగుంట మురళీమోహన్ పనితీరు నాసిరకంగా ఉందని ఆ నియోజకవర్గ ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఎవరికీ అందుబాటులో ఉండడం లేదనే విమర్శ ప్రదానంగా వినిపిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని, ఇప్పటికే స్పష్టం చేసిన ఆయన ఏదైనా నామినేటెడ్ పదవి తీసుకుని రాజకీయాలకు దూరంగా వెళ్లిపోవాలని భావిస్తున్నారు.2014లో పార్లమెంట్ సీటు ఇచ్చి పార్టీ అధినేత తప్పు చేశారని ఆయన వల్ల పార్టీకి ఒరిగిందేమిటని వారు ప్రశ్నిస్తున్నారు.ఇక చిత్తూరు ఎంపీ శివప్రసాద్.
అధిష్టానంపై విమర్శలు గుప్పించి ప్రస్తుతానికి మౌనంగా ఉన్నారు.దీంతో ఆయనకు మాత్రం మళ్లీ సీటు ఇచ్చేది లేదని పార్టీ అధిష్టానం నిర్ణయించింది.
పార్టీకి మేలు చేస్తారని పిలిచి మరీ సీటు ఇస్తే.భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని చంద్రబాబు భావిస్తున్నారట.







