తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) “రా కదలిరా”( Ra Kadalira ) సభలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.శనివారం కోనసీమ జిల్లా మండపేటలో( Mandapeta ) ఈ సభ జరగడం జరిగింది.
ఈ సందర్భంగా దళితులకు ఏదో మంచి చేసినట్లు ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుకుంటున్నారు అంటూ విమర్శించారు.దళితులకు న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ ( TDP ) అని తెలిపారు.
దళితుల అభ్యున్నతికి ఎన్నో చర్యలు.జీవోలు తీసుకొచ్చినట్లు చెప్పుకొచ్చారు.
మహనీయుడు అంబేద్కర్ కి ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నప్పుడే భారతరత్న వచ్చిందని గుర్తు చేశారు.కోనసీమ జిల్లాకు చెందిన జి.ఎం.సి బాలయోగిని లోక్ సభ స్పీకర్ గా నామినేట్ చేసింది టీడీపీనే అని స్పష్టం చేశారు.అంతేకాదు ప్రతిభ భారతిని అసెంబ్లీ స్పీకర్ గా కూడా నామినేట్ చేసినట్లు, దళితులను పారిశ్రామికవేత్తలుగా పైకి తీసుకురావడానికి ఎన్నో కృషి చేసినట్లు స్పష్టం చేశారు.
ఇక ఇదే సమయంలో వచ్చే ఎన్నికలలో మండపేట నియోజకవర్గం నుండి టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును( MLA Vegulla Jogeswara Rao ) మళ్లీ గెలిపించాలని ప్రజలను చంద్రబాబు కోరడం జరిగింది.జనసేనతో( Janasena ) సీట్ల సర్దుబాటు కాకముందే చంద్రబాబు అభ్యర్థిని ప్రకటించడం సంచలనంగా మారింది.మండపేట నుంచి జనసేన పార్టీకి చెందిన వేగుళ్ల లీలా కృష్ణ( Vegulla Leela Krishna ) టికెట్ ఆశిస్తున్నారు.
ఈ క్రమంలో చంద్రబాబు ప్రస్తుత ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావునీ అభ్యర్థిగా ప్రకటించడం చర్చనీయాంసంగా మారింది.