టాలీవుడ్ ( Tollywood )ఇండస్ట్రీలో స్వశక్తితో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు చంద్రమోహన్( Chandramohan ).ఈ నటుడు ఇవాళ చనిపోయి చాలామందిని ఏడిపిస్తున్నాడు.
ఎన్నో సినిమాల్లో హీరోలకు తండ్రిగా నేచురల్ యాక్టింగ్ కనబరిచి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.అతను యాక్టర్ అనుకోవడం కంటే ఫ్యామిలీ మెంబర్ అని ఫీల్ అయ్యే సినిమా ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
అలాంటి వ్యక్తి ఇప్పుడు లేడని నిజం చాలామందిని బాగా బాధ పెడుతోంది.చంద్రమోహన్ కుమార్తెలలో ఎవరూ కూడా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టలేదు కానీ అతని బంధువులు మాత్రం చలనచిత్ర రంగంలో చాలానే గుర్తింపు తెచ్చుకున్నారు.
వారెవరో కాదు మనందరికీ బాగా తెలిసిన దర్శక దిగ్గజం కె విశ్వనాథ్, గొప్ప ప్లేబాక్స్ సింగర్ బాలసుబ్రహ్మణ్యం.
దర్శకుడు విశ్వనాథ్ తో చంద్రమోహన్ కు దగ్గరి బంధుత్వం ఉంది.విశ్వనాథ్ తండ్రి సుబ్రహ్మణ్యం( Subrahmanyam ) మొదటగా పెళ్లి చేసుకున్న మహిళ చంద్రమోహన్‌కు స్వయానా పెద్దమ్మ అవుతుంది.ఆ రిలేషన్ ప్రకారం విశ్వనాథ్ చంద్రమోహన్ కు అన్నయ్య అవుతాడు.
వీరిద్దరూ కజిన్స్‌లా పెరిగారు.నిజానికి వీరిద్దరికీ వేరే బ్రదర్స్ ఎవరూ లేరు.
అందుకే మూవీ ఇండస్ట్రీ లోకి వచ్చాక వారి అనుబంధం మరింత బలపడింది.ఒకరినొకరు బాగా ఇష్టపడుతూ చివరికి పక్కపక్కనే ఇళ్లు కూడా కట్టుకున్నారు.
అయితే వ్యక్తిగతంగా వీరిద్దరూ ఆదర్శ అన్నదమ్ములే అయినా కెరీర్ పరంగా మాత్రం కొన్ని విభేదాలు ఉండేవి.
దర్శకుడు విశ్వనాథ్ మీద చంద్రమోహన్ ఎప్పుడూ కొన్ని కంప్లైంట్స్ చేసేవాడు.విశ్వనాథ్ తన సినిమాల్లో నటించి మరీ ఎలా నటించాలో నటులకు చెబుతాడని, అందువల్ల నటుడి స్వేచ్చ బాగా తగ్గిపోతుందని అప్పట్లో చంద్రమోహన్ ఫిర్యాదులు చేసేవాడు.ఇలా నటించి చూపించడం వల్ల ప్రతి నటుడు, నటీమణి విశ్వనాథ్ లాగా నటించాల్సిన పరిస్థితి వచ్చేదని చంద్రమోహన్ బాగా కంప్లైంట్ చేసేవాడు.
దీనిపై విశ్వనాథ్ ఎలా స్పందించారో తెలియ రాలేదు.ఇక దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ( SP Balasubrahmanyam )చంద్రమోహన్ కు తమ్ముడు అవుతాడు.తల్లి వైపు నుంచి చంద్రమోహన్ కి చుట్టమయ్యాడు.వీరు ముగ్గురు కూడా సినిమాల్లో చాలా బాగా రాణించారు.
తమ కుటుంబాల గౌరవాన్ని మరో లెవెల్‌కు తీసుకెళ్లారు.మళ్లీ ఇలాంటి సినిమా కళాకారులు టాలీవుడ్ ఇండస్ట్రీలో పుడతారని మనసారా ఆశిద్దాం.