రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీలో సమన్వయ లోపం కనిపిస్తోంది.చంద్రబాబు పదే పదేచెబుతున్నా.
సీనియర్లు ఎవరిదారిలో వారు నడుస్తున్నారు.బాబు చెప్పినప్పుడు.
సరే సార్ అంటున్నా.తర్వాత మాత్రం తమ వైఖరితోనే ముందు కు సాగుతున్నారు.
దీంతో అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ శ్రేణులు డీలా పడుతున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది.
కీలకమైన పంచాయతీ ఎన్నికల సమయంలో నాయకులు దూకుడుగా ముందుకు సాగాలని.వైసీపీ దూకుడుకు చెక్ పెట్టి ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను రగిలించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.
ఇదే విషయాన్ని ఆయన వారం రోజులుగా నిత్యం నాయకులకు నూరిపోస్తున్నారు.అయితే.ఆయా విష యాలకు నాయకులు బాగానే రియాక్ట్ అవుతున్నారు.ఓకేసార్.
ఖచ్చితంగా అలానే చేస్తాం.అంటున్నా రు.కానీ, వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత.ఎవరికి తోచినట్టు వారు వ్యవహరిస్తున్నారు.
ముఖ్యంగా క్షేత్రస్థాయి నేతలతో ముఖ్య నాయకులు, జిల్లా ఇంచార్జులు, పార్లమెంటరీ స్థాయి అధ్యక్షులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని చంద్రబాబు రెండు వారాలుగా చెబుతున్నారు.

అయితే.ఇప్పటి వరకు ఏ ఒక్కరూ ఈ పనిచేయలేదు.పోనీ.పంచాయతీస్థాయిలో పార్టీ పరిస్థితి ఎలా ఉందనే పరిస్థితిని కూడా సమీక్షించడం లేదు.దీంతో సమన్వయ లోపం కనిపిస్తోంది.నిజానికి పంచాయతీల్లో గత 2013లో టీడీపీ దూకుడు భారీగా సాగింది.
కొంచెం కష్టపడితే.మళ్లీ టీడీపీ పుంజుకునే అవకాశం కనిపిస్తోంది.
అయితే.నాయకులు మాత్రం ఆ దిశగా దృష్టి పెట్టడం లేదు.
అయితే, దీని వెనుక కూడా కారణాలు ఉన్నాయనిఅంటున్నారు పరిశీలకులు.
తమపై కేసులు నమోదైతే.
అధినేత పట్టించుకునే పరిస్థితి లేదని.ఇప్పటికే అన్నీ వదులకున్నామని.
ఆస్తులు కూడా కరిగిపోయాయని.తమకు భరోసా లేకుండా పోయిందని గుసగుస వినిపిస్తోంది.
అంటే.కీలక నేతలను కొన్ని భయాలు వెంటాడుతున్నాయనే వాదన వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎంతగా ప్రయాస పడుతున్నా.ఫలితం మాత్రం అనుకున్న విధంగా ఉండడం లేదన్నది వాస్తవం అంటున్నారు పరిశీలకులు.