హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఛలో రాజ్‌భవన్ కు పిలుపునిచ్చింది.అదానీ షేర్ల స్కాంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రాజ్‌భవన్ వద్దకు ర్యాలీగా వచ్చారు.
ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేంద్రం దుర్మార్గంగా వ్యవహారిస్తోందన్నారు.
ప్రతిపక్షాలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుందని ఆరోపించారు.ఎల్ఐసీ, ఎస్బీఐ సంస్థల డబ్బులను అదానీకి దోచి పెట్టారని మండిపడ్డారు.
ఈ క్రమంలో అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేశారు.







