రాణితో కలిసి చాయ్ తాగిన ఎలుగుబంటి.. ఎక్కడంటే?

బ్రిటన్ సింహాసనాన్ని క్వీన్ ఎలిజబెత్ అధిష్టించి నేటికి 70 వసంతాలు పూర్తయిన సందర్భరంగా UK వ్యాప్తంగా జాతర షురూ అయింది.4 రోజుల పాటు కొనసాగే ప్లాటిన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రజలు వేలాదిగా బకింగ్‌హమ్ ప్యాలెస్‌కు చేరుకున్నారు.ఈ తరుణంలో బ్రిటిష్ జాతీయ చిహ్నమైన ‘పాడింగ్టన్ బేర్‌‘తో ఆమె దర్శనమిచ్చింది.కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.96 ఏళ్ల క్వీన్ ఎలిజబెత్ బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో యానిమేటెడ్ బేర్‌తో కలిసి మినీమూవీలో కనిపించడం ప్రత్యేకతను సంతరించుకుంది.

 Chai Drinking Bear With The Queen , Tea , Bear, Queen, Viral Latest, News Vira-TeluguStop.com

ముందుగా రికార్డ్ చేసిన వీడియోలో CGI బేర్‌(బెన్ విషా గాత్రదానం)తో పాటుగా రాణి తన నటనా నైపుణ్యాలను ప్రదర్శించింది.

ఇందులో భాగంగా క్వీన్ ఎలుగుబంటితో టీ తాగుతున్న వీడియోను చూడవచ్చు.ఇక ఈ వీడియోలో రిజర్వ్ సప్లయ్ నుంచి రాణికి తన రహస్య ట్రీట్ అందించేందుకు పాడింగ్టన్ తన ఎరుపు రంగు బకెట్ టోపీని తీసివేస్తాడు.‘బహుశా మీరు మార్మాలాడే శాండ్‌విచ్‌ కోరుకుంటున్నారా? ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కోసం నేను ఎప్పుడూ ఒకదాన్ని ఉంచుతాను’ అని పాడింగ్టన్ చెప్పగా.అందుకు రాణి స్పందిస్తూ తన పర్సులోంచి శాండ్‌విచ్ తీసి ‘నేను కూడా అలాగే’ అని సమాధానం చెప్పి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

పెరువియన్‌లో జన్మించిన ఎలుగుబంటిని అభినందించడంతో సదరు వీడియో ముగుస్తుంది.

Telugu Bear, Chai, Queen, Queen Elizabeth, Latest-Latest News - Telugu

ఈ షార్ట్ ఫిల్మ్ బ్రిటిష్ రాణి అతిథి పాత్రను సూచిస్తున్నప్పటికీ, ఆమెకు ఇదే మొదటి చిత్రం కాదు.2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్‌కు గుర్తుగా, ఓ రికార్డెడ్ వీడియోలో డేనియల్ క్రెయిగ్‌తో బాండ్ గర్ల్‌గా కనిపించింది మన క్వీన్.ఈ వీడియో తర్వాత రాజ కుటుంబ సభ్యుల భావోద్వేగ ప్రసంగాలు కొనసాగాయి.

ఆ తర్వాత డయానా రాస్, రాక్ బ్యాండ్ క్వీన్, లిన్-మాన్యువల్ మిరాండా, సర్ ఎల్టన్ జాన్, డురాన్ డురాన్, అలీసియా కీస్ వంటి హేమాహేమీలు తమ సంగీతంతో ఆహుతులను అలరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube