క్యూ కట్టబోతున్న కేంద్ర నాయకులు ! మునుగోడు లో రేంజ్ చూపించనున్న బీజేపీ ?

రోజురోజుకు మునుగోడు రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి.ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ తమ పార్టీకి చెందిన కీలక నాయకులందరిని నియోజకవర్గంలో మోహరించి, ప్రతి గడపను, ప్రతి ఓటర్ ను కలుస్తూ, తమ పార్టీకి ఓటు వేయాలంటూ ఆయా గ్రామాలకు ఇన్చార్జీలుగా నియమితులైన నాయకులు , తమ అనుచరులతో ఓటర్ల ను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

 Central Ministers Campaigns In Munugodu Munugodu Asembly Elections Munugodu-TeluguStop.com

కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి, టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ , బిజెపి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు.ఇప్పటికే వీరి నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది.

రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండడం తో పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారంపైనే వీరంతా దృష్టి సారించారు.వచ్చే నెల మూడో తేదీన జరగబోతున్న పోలింగ్ లో ఓటర్లంతా తమవైపు ఉండేలా మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

         తమ సత్తా చాటుకోవాలనే లక్ష్యంతో కేంద్ర అధికార పార్టీ బిజెపి స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తో ఈ అంశాలపై చర్చించేందుకు ఢిల్లీకి కూడా పిలిపించారు.ఇక కేంద్ర మంత్రులు , బిజెపి అగ్ర నాయకులు ఇలా అంత మునుగోడులో ఎన్నికల ప్రచారానికి వచ్చే విధంగా బిజెపి అధిష్టానం షెడ్యూల్ కూడా రూపొందించింది.

మొత్తం 11 మంది ముఖ్య నేతలతో విస్తృతంగా ప్రచారం చేయించనున్నట్లు ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ తెలిపారు.మునుగోడు లో మొత్తం రెండు దఫాలుగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు షెడ్యూల్ రూపొందించారు.

రేపటి నుంచి రాష్ట్రస్థాయి నాయకులు, ఈనెల 25 నుంచి కేంద్ర బిజెపి పెద్దలు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.   

Telugu Amith Sha, Komatirajagopal, Komati Venkata, Revanth Reddy, Telangana-Poli

    ప్రస్తుతం ఎన్నికల ప్రచారం నిర్వహించే వారి జాబితాలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ , డీకే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటెల రాజేందర్, మురళీధర్ రావు, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు , విజయశాంతి, బాబు మోహన్ వంటి వారు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో మొత్తం 74 గ్రామాల్లో రోడ్ షో నిర్వహించనున్నారు.ఇక తరువాత కేంద్ర మంత్రులు బిజెపి అగ్ర నేతలు వరుసగా తెలంగాణకు రాబోతున్నారు.

ఈనెల 29వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా మునుగోడు నియోజకవర్గం లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు ఈ విధంగా టిఆర్ఎస్ కాంగ్రెస్ లపై పై చేయి సాధించేందుకు బిజెపి అగ్రనేతలంతా మునుగోడుకు క్యూ కట్టేందుకు సిద్ధమైపోతున్నారు.     

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube