ఒకప్పుడు మీడియా చానళ్ళు ఎన్ని ఉండేవంటే మనకి సుమారుగా వేళ్ళమీద లెక్కపెట్టగలిగే అన్ని ఉండేవి.కానీ సోషల్ మీడియా మన నట్టింట్లోకి వచ్చిన తరువాత రకరకాల మీడియా చానళ్ళు పుట్టగొడుగుల్లాగా పుట్టుకు వచ్చాయి.
ఎంతలా అంటే కనీసం జర్నలిజం విలువని పాటించని ఛానళ్ళే ఇపుడు ఎక్కువగా వున్నాయి.వాటికి పెద్ద పీట వేస్తోంది యూట్యూబ్( YouTube ).కంటెంట్ క్రియేటర్లు వ్యూస్ కోసం వారికి నచ్చినట్టుగా కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు.అందులో ఫేక్ న్యూస్ ఎక్కువగా ప్రబలుతోంది.
కాగా అలాంటి ఛానళ్లపైన వేటువేయడానికి కేంద్రం పధకం రచించింది.

ఈ క్రమంలోనే ముందస్తు లోక్‌సభ ఎన్నికలని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను నిషేధించడం వంటి బోగస్ వార్తలను ప్రసారం చేసినందుకు గాను 8 యూట్యూబ్ ఛానళ్లను కేంద్ర ప్రభుత్వం( Central Govt ) నిషేదిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.ఆ ఛానళ్ల లిస్ట్ విషయానికొస్తే… క్యాపిటల్ టీవీ, యహాన్ సచ్ దేఖో, కేపీఎస్ న్యూస్, ఎర్న్ టెక్ ఇండియా, సర్కారీ వ్లాగ్, వరల్డ్ బెస్ట్ న్యూస్ ఛానల్, ఎస్‌పీఎన్ 9 న్యూస్, ఎడ్యుకేషనల్ దోస్త్… తదితర చానళ్ళు ఉన్నాయి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మెంబర్స్, ఆ ఛానళ్లకు సంబంధించినటువంటి వివరాలను సేకరించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తాజాగా వెల్లడించారు.

ఇక వరల్డ్ బెస్ట్ న్యూస్ ఛానల్ అయితే ఏకంగా భారత సైన్యాన్ని కించపరుస్తూ.సైన్యాన్ని తక్కవ చేసి చూపించినట్టు అధికారులు వెల్లడించారు.అదేవిధంగా ఎడ్యుకేషనల్ దోస్త్ అనే ( Educational Dost )ఛానల్ ప్రభుత్వ పథకాల గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మెంబర్స్ నిర్ధారించారు.ఇక SPN9 ఛానల్ రాష్ట్రపతి, ప్రధాన మంత్రితో పాటు పలువురికి సంబంధించిన ఫేక్ వార్తలను సృష్టించి మరీ ప్రచురించింది.
అదేవిధంగా సర్కారీ వ్లాగ్ ఛానల్ ప్రభుత్వ పథకాలపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.ఇలా రకరకాల ఆరోపణలతో ఆయా చానళ్లకు వేటు పడింది.ఈ సందర్భంగా కేంద్రం పలు చానళ్లకు గట్టిగా హెచ్చరించింది.







