భారతీయ ప్రవాస కుటుంబాలకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది.ముఖ్యంగా ప్రవాస విద్యార్ధులు ఎగిరి గంతేసేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అంతేకాదు ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.కమిటి తుది రిపోర్ట్ అందిన తరువాత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేయనుందట.
అదే గనుకా జరిగితే విదేశాలలో ఉంటున్న మన భారత సంతతి ప్రవాసుల పిల్లలకు ఎంతో లాభం చెకూరనుందట.ఇంతకీ ఏమిటా నిర్ణయం, ప్రవాస విద్యార్ధులకు ఎలాంటి లాభం కలుగుతుందనే వివరాలలోకి వెళ్తే.
ఐఐటి ( ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ) విద్యపై ఎంతో మంది ఆసక్తి చూపుతుంటారు.ఐఐటి కి ఉన్న డిమాండ్ కూడా భారీగానే ఉంటుంది.ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఐఐటీ పూర్తి చేస్తే ఉద్యోగాలకు కొదవే లేదు.మంచి ఉద్యోగంతో పాటుగా, కళ్ళు చెదిరే జీతంతో ఎన్నో కంపెనీలు విద్యార్ధుల కోసం క్యూ కడుతుంటాయి.
ఈ ఐఐటీ క్యాంపస్ లలో సీటు సాధించేందుకు ప్రతీ ఏటా లక్షలాది మంది పోటీ పడుతుంటారు.అంతేకాదు విదేశాలలో ఉన్న ప్రవాసుల పిల్లలు సైతం ఎన్నారై కోటాలో ఐఐటీ లలో చేరేందుకు ఆసక్తి చూపుతుంటారు.
ఈ క్రమంలోనే.

కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.విదేశాలలో కూడా ఐఐటి క్యాంపస్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.సుమారు ఏడు దేశాలలో ఐఐటి క్యాంపస్ లు పెట్టనున్నట్టుగా ప్రకటించింది.
ఇండియన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పేరుతో ఈ క్యాంపస్ లను ఏర్పాటు చేయనుందట.యూకే, యూఏఈ, సౌదీ, ఖతర్, మలేషియా, ధాయ్ల్యాండ్, లలో క్యాంపస్ లు పెట్టనుంది.
వీటి ఏర్పటు కోసం ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన 17 మంది సభ్యులతో కూడిన కమిటి ఆయ ఆదేశాల రాయభార కార్యాలయాలతో సంప్రదింపులు జరుపుతోందట.అతి త్వరలోనే ఈ క్యాంపస్ లు ప్రారంభించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిందట.
అదే జరిగితే ఎంతో మంది ప్రవాస భారతీయ విద్యార్ధులకు భారీగా లబ్ది చెకూరుతుందని అంటున్నారు నిపుణులు.







