తెలంగాణలో పోలింగ్ పై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టింది.ఈ మేరకు సీఈఓ వికాస్ రాజ్ తో కేంద్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఇందులో భాగంగా పోలింగ్ ఏర్పాట్లతో పాటు కౌంటింగ్ సెంటర్లపై చర్చించారు.అలాగే సెలైన్స్ పీరియడ్ లో కఠినంగా వ్యవహరించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
ఇవాళ సాయంత్రం 5 నుంచి సెలైన్స్ పీరియడ్ అమల్లోకి రానుండగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ సిబ్బందితో పాటు కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి.ఈనెల 30న పోలింగ్ జరగనుండగా ఇందుకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లను పూర్తి చేశారని తెలుస్తోంది.







