ఏపీ విభజన బిల్లులో పొందుపరిచిన కేంద్ర విద్యాసంస్థల్లో ఒకటైన ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ ( Indian Institute of Management )శాశ్వత క్యాంపస్ ను ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం జగన్( CM YS JAGAN ) వర్చువల్ గా ప్రారంభించనున్నారు.

ఐఐఎం విశాఖ, ఐఐఐటీడీఎం కర్నూల్ శాశ్వత క్యాంపస్ ను మోదీ( Narendra Modi ) ప్రారంభించనున్నారు.అనంతరం ఐఐటీ తిరుపతి, ఐఐఎస్ఈఆర్ తిరుపతి భవనాలను మోదీ జాతికి అంకితం చేయనున్నారు.2015 నుంచి ఐఏఎం విశాఖ కార్యాలయాలను ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో శాశ్వత భవన నిర్మాణం కోసం <ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విశాఖ శివారు ప్రాంతంలో సుమారు 241 ఎకరాలను కేటాయించింది.ఈ స్థలంలో రెండు దశల్లో భవన నిర్మాణాలను చేపట్టారు.







