లైగర్ పోస్టర్ పై సెలబ్రేటిస్ ప్రశంసలు.. పాన్ ఇండియా లెవల్ లో ట్రోల్స్!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న చిత్రం లైగర్.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

 Celebrities Praise Liger Nude Photo Netizens Trolls Liger Movie, Vijay Devarakon-TeluguStop.com

ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరక్కపోతున్న విషయం అందరికీ తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి లేటెస్టుగా ఓ బోల్డ్ పోస్టర్ రిలీజ్ చేయబడింది.

ఇందులో విజయ్ బాడీ ఒంటి మీద ఎలాంటి డ్రెస్ లేకుండా కేవలం గులాబీలను అడ్డుగా పెట్టుకొని నిలబడి ఉన్నాడు.ఈ ఫోటో పై అభిమానులు మాత్రమే కాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా స్పందించారు.

పలువురు సెలబ్రిటీలు ఆ పోస్టర్ పై ప్రశంసలు కూడా కురిపించారు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అయిన అనుష్క శెట్టి,సమంత,పూజా హెగ్డే,రష్మిక మందన్న జాన్వీ కపూర్ వంటి పాపులర్ హీరోయిన్ లు ఈ పిక్ పై కామెంట్స్ చేస్తూ విజయ్ దేవరకొండ ని కొనియాడారు.

సెలబ్రిటీలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తూ పొగుడుతూ కామెంట్స్ చేయగా.సాధారణ ప్రేక్షకులు మాత్రం విజయ్ దేవరకొండ న్యూడ్ స్టిల్ పై పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.

యాంటీ ఫ్యాన్స్ మరియు వ్యతిరేక వర్గం వంటి వారు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు.ఇందులో విజయ్ బాక్సర్ గా కనిపిస్తారు అంటే ఇలా బాక్సర్ లేకుండా చూపిస్తారని అనుకోలేదని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు./br>

Telugu Ananya Pandey, Liger, Netizens Troll, Tollywood-Movie

ఇక ఆ న్యూడ్ ఫోటోని షేర్ చేస్తు విజయ్ ఈ విధంగా రాసుకొచ్చాడు.నేను ఈ సినిమా కోసం సర్వస్వం అర్పించాను.నటనలో మానసికంగా శారీరకంగా నా మోస్ట్ ఛాలెంజింగ్ రోల్ అని విజయ్ ట్వీట్ చేయగా.సర్వస్వం ఇవ్వడం అంటే బట్టలు కూడా ఇచ్చేయడమేనా అని మరో నెటిజన్ సెటైర్ వేశారు.

సంపూర్ణేష్ బాబు క్యాలీ ప్లవర్ అడ్డు పెట్టుకొని అసెంబ్లీ ముందు నిలబడితే ఇక్కడ వీడీ గులాబీ గుచ్చాన్ని అడ్డుపెట్టుకుని రోడ్డుపై నిలబడ్డాడని ట్రోల్ చేస్తున్నారు.మొత్తానికి కొంతమంది విజయ్ షేర్ చేసిన ఫోటోల పై ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube