శోభాశెట్టి ఎలిమినేషన్ తో సోషల్ మీడియాలో సంబరాలు.. షో చరిత్రలో ఇదే తొలిసారంటూ?

బిగ్ బాస్ హౌస్ ( Bigg Boss House ) నుంచి శోభాశెట్టి ఎలిమినేట్ కావడంతో బిగ్ బాస్ షో అభిమానులు మాత్రం ఎంతగానో సంతోషిస్తున్నారు.

శోభాశెట్టి( Sobha Shetty ) ఎలిమినేషన్ గురించి మీమ్స్, రీల్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

సాధారణంగా బిగ్ బాస్ నుంచి ఎవరైనా కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారంటే ఫ్యాన్స్ నుంచి సింపతీ రావడం జరుగుతుంది.అయితే శోభాశెట్టి ఎలిమేషన్ విషయంలో మాత్రం భిన్నంగా జరగడం గమనార్హం.

బిగ్ బాస్ షో చరిత్రలో ఈ విధంగా తొలిసారి శోభాశెట్టి విషయంలోనే జరిగిందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.శోభాశెట్టి గురించి ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో నెగిటివిటీ ఉందో సులువుగానే అర్థమవుతుంది.

బిగ్ బాస్ షో చివరి వారం ఆరుగురు కంటెస్టెంట్లు హౌస్ లో ఉండగా ఈ ఆరుగురిలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడల్సి ఉంది.బిగ్ బాస్ షోకు విజేతగా నిలిచే అర్హత అమర్ దీప్, పల్లవి ప్రశాంత్, శివాజీలకు ఉంది.

Advertisement

ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు విజేతగా నిలిచే అవకాశం ఉండగా ఎవరు విజేతగా నిలుస్తారో చూడాల్సి ఉంది.బిగ్ బాస్ షో సీజన్7 విన్నర్ కు 50 లక్షల రూపాయల ఫ్రైజ్ మనీతో పాటు ఇతర బహుమతులు కూడా దక్కనున్నాయి.బిగ్ బాస్ షో సీజన్7 గ్రాండ్ ఫినాలేకు క్రేజీ సెలబ్రిటీలు హాజరు కానున్నారని సమాచారం అందుతోంది.

బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలేకు మంచి రేటింగ్ రావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

మరోవైపు నాగార్జున ( Nagarjuna )ఈ షో కోసం ధరిస్తున్న దుస్తులు సైతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.లక్షల్లో ఖరీదు చేసే దుస్తులను నాగ్ ఈ షో కోసం ధరిస్తున్నారు.వీకెండ్ ఎపిసోడ్ లో నాగ్ ధరించిన స్వెట్ టీ షర్ట్ ఫోటోలు వైరల్ కాగా ఆ టీ షర్ట్ ఖరీదు ఏకంగా రెండు లక్షల 11 వేల 990 రూపాయలు కావడం గమనార్హం.

నాగ్ తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...
Advertisement

తాజా వార్తలు