ఘనంగా స్వర్గీయ వెంకట్ రెడ్డి బాపు 9వ వర్ధంతి వేడుకలు

దర్యాప్తు ప్రతినిధి ఎల్లారెడ్డిపేట జూన్ 28: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గాంధీ చౌక్ విగ్రహం వద్ద స్వర్గీయ నేవూరి వెంకట్ రెడ్డి 9వ వర్ధంతి వేడుకలను గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వెంకట్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి ఎల్లారెడ్డిపేట గ్రామానికి చేసిన సేవలను ఆయన చేసిన అభివృద్ధిని నెమరు వేసుకున్నారు.ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ సమావేశంలో గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామపంచాయతీ ఆవరణలో స్వర్గీయ నేవూరి వెంకట్ రెడ్డి బాపు విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని తీర్మానించినట్లు ఆమె వెల్లడించారు.

ఆయన ప్రజాక్షేత్రంలో ఉంటూ అనునిత్యం ప్రజల కొరకు పాటుపడుతూ ప్రజాసేవకే అంకితమై ఎల్లారెడ్డిపేట గ్రామ ప్రజల మదిలో చిరస్థాయి ముద్రను వేసుకున్నారని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు,కటుకం రామచంద్రం, అల్లం లక్ష్మణ్, మల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ ఓగ్గు బాలరాజు యాదవ్, బండారి బాల్ రెడ్డి, మేగి నరసయ్య, గుండాడి వెంకట్ రెడ్డి, సందుపట్ల లక్ష్మారెడ్డి, కిష్టారెడ్డి, పరుశురాములు, ద్యాగం రాములు, ద్యాగం లక్ష్మి నారాయణ, మాజీ ఎంపీటీసీ నేవూరి రవీందర్ రెడ్డి,మనం ఎల్లయ్య,శ్యామ మంజుల, ప్రభాకర్ రెడ్డి, రామ్ రెడ్డి, నారాయణరెడ్డి, కృష్ణారెడ్డి, వెంకట నరసింహారెడ్డి,గిరిధర్ రెడ్డి,లక్ష్మణ్, అంజయ్య గౌడ్, బాలా గౌడ్, రాజయ్య, బాలాజీ, కిషన్, భాస్కర్, శ్రీనివాస్, రాజిరెడ్డి, దేవేందర్, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మీ నరసయ్య, నరసింహారెడ్డి, శివ,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News