ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ వాసుదేవ రెడ్డి( Vasudeva Reddy ) బదిలీకి కేంద్ర ఎన్నికల సంఘం( CEC ) ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డికి( CS Jawahar Reddy ) సీఈసీ ఆదేశాలు ఇచ్చింది.
వాసుదేవరెడ్డికి ఎన్నికల విధులను అప్పగించ వద్దని ఈసీ స్పష్టం చేసింది.
అదేవిధంగా ఇవాళ రాత్రి 8 గంటల్లోగా బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ( Beverages Corporation MD ) నియామకం కోసం ముగ్గురు ఐఏఎస్ అధికారుల పేర్లను పంపాలని సీఈసీ వెల్లడించింది.
అయితే రాష్ట్రంలో మద్యం ఉత్పత్తి, విక్రయాల వ్యవహారంలో వాసుదేవరెడ్డిపై ఈసీ చర్యలు తీసుకుంది.