తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ వ్యవహారంలో సైబర్ క్రైమ్ పోలీసుల విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విచారణ నిమిత్తం సీసీఎస్ ఎదుట హాజరైయ్యారు.
ఈ క్రమంలో మల్లు రవి మాట్లాడుతూ పోలీసులు ఏ అంశంపై విచారణ చేస్తారో సమాచారం లేదన్నారు.పోలీసుల విచారణకు సహకరిస్తానని తెలిపారు.
కాంగ్రెస్ వార్ రూమ్ నుంచి తమ పార్టీకి సంబంధించిన విలువైన సమాచారాన్ని పోలీసులు తీసుకెళ్లారని పేర్కొన్నారు.విచారణ తర్వాత తమ సమాచారం తమకు ఇవ్వాలని కోరుతానని వెల్లడించారు.
కాగా ఈ కేసులో ఈనెల 9న మల్లు రవికి సీసీఎస్ పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ వ్యవహారంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలును అధికారులు విచారించారు.
మరోవైపు వార్ రూమ్ కి తనే ఇంచార్జ్ గా ఉన్నట్లు గతంలో మల్లు రవి ప్రకటించారు.ఈ నేపథ్యంలోనే సైబర్ క్రైమ్ పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు.







