కేసీఆర్ ని ఏపీకి రమ్మంటున్న బాబు ! వాళ్లతో కలిసి ....?

తెలంగాణ సీఎం కేసీఆర్ … ఏపీ సీఎం చంద్రబాబు మధ్య ఇప్పుడు రాజకీయ వైరం బాగా ముదిరిపోయింది.నిన్న చంద్రబాబు మీద … కేసీఆర్ భారీ భారీ విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ రోజు బాబు కూడా … ఆయన మీద అదే స్థాయిలో విమర్శలు చేశారు.

 Cbn Comented On Kcr Modhi And Jagan-TeluguStop.com

ఏపీకి వస్తానని కేసీఆర్‌ అంటున్నారని.రండి.

ప్రచారం చేసుకోండి అంటూ.బాబు పిలుపునిచ్చారు.

ఈ రోజు అమరావతిలో ఆయన మాట్లాడుతూ ‘ముసుగులో గుద్దులాట ఎందుకు? వైసీపీ, బీజేపీలతో కలిసి పోటీ చేయండి.ఎవరు వద్దరన్నారు.?’ అని ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా ప్రచారం చేయొచ్చన్న బాబు.మోడీని కేసీఆర్‌ నెత్తిన పెట్టుకుంటే తమకేం నష్టం లేదని స్పష్టం చేశారు.‘కేసీఆర్-మోడీ ఇష్టపడి తిట్టుకుంటున్నారు.కేసీఆర్‌కు మెచ్యూర్టీ ఉందని మోడీ మెచ్చుకుంటున్నారు.కేసీఆర్ కామెంట్లు చేస్తే.జగన్ ట్వీట్ చేస్తారు.వీరిద్దరికీ మోడీ ఫోన్ చేసి మెచ్చుకుంటారు.

మోడీ ఢిల్లీలో ఉంటే.మిడిల్‌ మోడీ కేసీఆర్.

జూనియర్ మోడీ జగన్’ అని అన్నారు.ఏపీ అభివృద్ధి కాకూడదనేదే మోడీ, కేసీఆర్ అభిప్రాయం అని … వారితో జగన్ కూడా కుమ్మక్కైయ్యాడని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube