Minister Kakani Govardhan Reddy : సీబీఐ అంటే చంద్రబాబు విచారణ కాదు..: మంత్రి కాకాణి

టీడీపీ నేత సోమిరెడ్డిపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి( Minister Kakani Govardhan Reddy ) తీవ్రంగా మండిపడ్డారు.

సీబీఐ విచారణను కూడా సోమిరెడ్డి( Somireddy ) తప్పు పడుతున్నారని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే సీబీఐ( CBI ) అంటే చంద్రబాబు విచారణ కాదని తెలిపారు.చంద్రబాబు, లోకేశ్ మరియు సోమిరెడ్డి తనను కోర్టు దొంగ అని మాట్లాడారన్న ఆయన టీడీపీ అనుకున్న ప్రకారం దర్యాప్తు సంస్థలు పని చేయాలా అని ప్రశ్నించారు.

అలాగే చంద్రబాబు( Chandra Babu ) పొత్తుల గురించి తాము ఆలోచించడం లేదని చెప్పారు.ఏ చిన్న పార్టీ వచ్చినా చంద్రబాబు కలుస్తారని విమర్శించారు.చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ కలిసి వస్తున్నారంటే వైసీపీ బలం ఏంటో తెలుస్తుందని తెలిపారు.

తెలంగాణలో బోనస్ అనేది బోగస్.. : నిరంజన్ రెడ్డి
Advertisement

తాజా వార్తలు