నెల్లూరు కోర్టులో చోరీ కేసుపై సీబీఐ దర్యాప్తు

నెల్లూరు కోర్టులో డాక్యుమెంట్స్ చోరీ అయిన కేసుపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.గత మూడు రోజులుగా నెల్లూరులో అధికారులు విచారణ చేస్తున్నారు.

ఈ క్రమంలో పోలీసులను, కోర్టు సిబ్బందిని అధికారులు విచారించారు.ఇవాళ మాజీమంత్రి సోమిరెడ్డిని విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే చోరీ ఘటనపై ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.నెల్లూరు పట్టణంలోని సయ్యద్ హయత్, ఆత్మకూరు మండలం కరటంపాడుకు చెందిన షేక్ ఖాజా రసూల్ ఈ కేసులో నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే.

నకిలీ రబ్బరు స్టాంపులు, రౌండ్ సీళ్లు, స్టాంప్ ప్యాడ్‎లు, ల్యాప్‎టాప్ లు, ట్యాబ్, పెన్‎డ్రైవ్ తో పాటు నకిలీ టెలిఫోన్ బిల్లులు చోరి అయ్యాయని సీబీఐ ఎఫ్ఐఆర్‎లో ప్రస్తావించినట్లు సమాచారం.

Advertisement
చేతివాటం చూపించిన జొమాటో డెలివరీ బాయ్.. వీడియో వైరల్..

తాజా వార్తలు