దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ దూకుడు పెంచింది.ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసి ఐదు రోజుల కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
మద్యం కుంభకోణంలో ఏ1గా ఉన్న మనీశ్ సిసోడియాను మూడో రోజు సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.లిక్కర్ పాలసీ రూపకల్పనలో ఎన్నో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో పాటు మద్యం వ్యాపారులకు అనుకూలంగా పాలసీ రూపొందించారన్న ఆరోపణల నేపథ్యంలో సిసోడియా స్టేట్ మెంట్ ను సీబీఐ రికార్డ్ చేయనుంది.
అదేవిధంగా నిందితులతో ఉన్న సంబంధాలపై సిసోడియాను విచారిస్తుంది.మార్చి 4 వరకు సీబీఐ కస్టడీలో ఉండనున్నారు సిసోడియా.
మరోవైపు సిసోడియాను ప్రతిరోజు కుటుంబ సభ్యులు కలిసేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది.







