ప్రస్తుత సమాజంలో దారుణాలు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి.ఆడవాళ్లు అత్యాచారాలకు గురి కావడం, మగవాళ్లు దారి దోపిడీలకు గురవుతున్నారు.
ఈ క్రమంలోనే పశువుల వ్యాపారి( Cattle Trader ) పశువులు కొనేందుకు బైక్ పై బయలుదేరి దారి మధ్యలో ఆకలి వేయడంతో టిఫిన్ కోసం ఆగి, టిఫిన్ చేశాక బిల్లు చెల్లిస్తుండగా.అతని వద్ద ఉండే డబ్బులు( Money ) చూసిన ఓ కేటుగాడు ఆ డబ్బులు కాజేసిన ఘటన కరీంనగర్ లోని( Karimnagar ) మానకొండూరు మండలం శంశాబాద్ శివారులో గురువారం చోటుచేసుకుంది.
ఆ దారి దోపిడీకి సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.
శంకరపట్నం మండలం కరీం పేటకు చెందిన అంకతి రాజయ్య(63)( Ankathi Rajaiah ) అనే వ్యక్తి పశువుల వ్యాపారం చేస్తుంటాడు.అయితే గురువారం ఉదయం పెద్దపల్లి జిల్లా గర్రెపల్లి పశువుల సంతకు బైక్ పై బయలుదేరాడు.
అయితే మార్గమధ్యంలో టిఫిన్ చేసేందుకు తాడికల్ గ్రామ శివారులో ఉండే హోటల్ వద్ద ఆగాడు.
టిఫిన్ చేసిన తర్వాత బిల్ చెల్లిస్తుండగా.అతని వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు ఉండడం ఓ గుర్తు తెలియని వ్యక్తి గమనించాడు.ఆ డబ్బును ఎలాగైనా కాజేయాలని రాజయ్య వద్దకు వచ్చి మంచిగా మాట్లాడుతూ తన వద్ద ఒక గేదె ఉందని, అమ్ముతానని నమ్మకపు మాటలు చెప్పాడు.
దీంతో రాజయ్య ఆ గుర్తు తెలియని వ్యక్తితో వెళ్ళాడు.మానకొండూరు మండలం( Manakonduru ) శంశాబాద్ శివారులోని ఓ కాలువ ప్రాంతానికి చేరుకోగానే ఆ గుర్తు తెలియని వ్యక్తి రాజయ్యను డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు.రాజయ్య డబ్బులు ఇవ్వకపోవడంతో కళ్లలో కారం చల్లి, కత్తితో దాడి చేసి రాజయ్య వద్ద ఉండే రూ.82000 తీసుకొని పారిపోయాడు.రాజయ్య మానకొండూరు పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని గుర్తుతెలియని ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy