బాలయ్యకు బిస్కెట్ ఇచ్చిన బ్యూటీ

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఇప్పటికే లాంఛ్ అయిన ఈ సినిమాలో నటీనటుల కోసం బోయపాటి నానా కష్టాలు పడుతున్నాడు.

ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలా అనే విషయంపై చిత్ర యూనిట్ తెగ కష్టపడుతోంది.ఇటీవల ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ కేథరిన్ త్రేసాను చిత్ర యూనిట సంప్రదించింది.

ఆమె కథ విన్నాక నటించేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందట.అయితే తన రెమ్యునరేషన్ విషయంలో తేడాలు రావడంతో ఆమె ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు ఫిలింనగర్ టాక్.

గతంలో బోయపాటి తెరకెక్కించిన సరైనోడు సినిమాలో ఆమెకు మంచి పాత్ర దక్కడంతో, మరోసారి బోయపాటి డైరెక్షన్‌లో సినిమాకు ఒప్పుకుంది.

Advertisement

కానీ రెమ్యునరేషన్ దగ్గర తేడా రావడంతో ఆమె ఈ సినిమాను వదులుకుంది.మరి బాలయ్య సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.ఈ సినిమా షూటింగ్‌ను అతిత్వరలో ప్రారంభించి వేసవి కానుకగా సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

అందుకే నేను ఏ రోజు సొంత పిల్లల గురించి ఆలోచించ లేదు : రాజమౌళి
Advertisement

తాజా వార్తలు