రవితేజకు మాస్ పాఠాలు నేర్పనున్న ఎమ్మెల్యే

మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ వేసవి కానుకగా రిలీజ్ కావాల్సి ఉంది.

కానీ కరోనా ప్రభావంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.

ఇక ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారనే వార్తలు వచ్చినా, చిత్ర యూనిట్ మాత్రం ఈ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని తేల్చేశారు.దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Catherine Tresa Item Song In Raviteja Movie, Raviteja, Krack, Catherine Tresa, I

ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, రవితేజ తన నెక్ట్స్ చిత్రాలను లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు.ఇప్పటికే నక్కిన త్రినాథరావు డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు రవితేజ రెడీ అయ్యాడు.

ఈ సినిమాతో పాటు మరో డైరెక్టర్ రమేష్ వర్మ డైరెక్షన్‌లో కూడా ఓ సినిమా చేసేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ డ్యుయెల్ రోల్ చేయబోతున్నాడని తెలుస్తోంది.

Advertisement

ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా నిధి అగర్వాల్, నభా నటేష్‌లు నటిస్తారని చిత్ర యూనిట్ తెలిపింది.కాగా ఈ సినిమాలో ఓ హాట్ ఐటెం సాంగ్ ఉండబోతుందని, అందులో రవితేజతో చిందులేసేందుకు ఓ బ్యూటీని ఇప్పటికే ఓకే చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రంతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న బ్యూటీ కేథరిన్ త్రేసా, ఆ తరువాత వరసగా సినిమాలు చేస్తూ వస్తోంది.సరైనోడు చిత్రంలో ఎమ్మెల్యే పాత్ర ఆమెకు మంచి పేరును తీసుకొచ్చింది.

ఇక ఈ బ్యూటీ, ప్రస్తుతం బోల్డ్ పాత్రలతో పాటు స్పెషల్ సాంగ్స్‌కు కేరాఫ్‌గా మారడంతో, ఆమెను ఈ సినిమాలోని ఐటెం సాంగ్‌లో తీసుకునేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది.ఇక ఈ పాటలో రవితేజతో అమ్మడు వేసే చిందులు మాస్ ప్రేక్షకులకు ఫుల్ ట్రీట్ ఇవ్వడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

మొత్తానికి ఈ ఐటెం సాంగ్ కేథరిన్ త్రేసాకు మంచి బ్రేక్ ఇవ్వనుందనే వార్త ప్రస్తుతం ఆమె ఫ్యాన్స్‌కు సంతోషాన్ని కలిగిస్తుంది.మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.

ముక్కు దిబ్బడతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసం!
Advertisement

తాజా వార్తలు