అర్ధ రాత్రి సమయం 12-00 గంటలు….సాధారణంగా అందరు నిద్రకు ఉపక్రమించే సమయం.
ఆ సమయంలో పోలీసులకు ఫోన్ కాల్ వచ్చిందంటే ఏదో సంఘటన జరిగి ఉంటుందని ఆందోళన చెందుతారు.అటువంటి సమయంలో సరిగ్గా అర్ధ రాత్రి 12-00 గంటలకు కరీంనగర్ సిపి శ్రీ సత్యనారాయణ గారికి ఒక ఫోన్ కాల్ వచ్చింది.
ఆ ఫోన్ చేసిన వ్యక్తి, కరీంనగర్ సిపి తో సార్ మా ఇంటిలో ఉన్న బావిలో పిల్లి పడిపోయింది.దానిని కాపాడడానికి సహాయం చేయండి.
మామూలుగా రకరకాల పని ఒత్తిడిలో రోజంతా గడిపిన పోలీసులు, రాత్రి సేద తీరే సమయానికి, ఇటువంటి ఫోన్ కాల్ విన్న తర్వాత అసహనానికి గురై ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది.కానీ మాకెందుకులే అని దాట వేయకుండా, ఫోన్ చేసిన వారిపై అసహనం వ్యక్తం చేయకుండా వెంటనే స్పందించి టౌన్ ఏ సి పి తుల శ్రీనివాస రావు కి ఫోన్ చేసి, కాలర్ తో అత్యవసరంగా మాట్లాడి, ఆ పిల్లిని రెస్క్యూ చేయమని ఆదేశించడం జరిగింది.
అంతేకాకుండా వాట్సాప్ లో వారి లొకేషన్ మరియు కాంటాక్ట్ నెంబర్ కూడా కరీంనగర్ టౌన్ ఏసిపి కి షేర్ చేయడంతో….టౌన్ ఏ సి పి, ఆ ఏరియా లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ అంజి రెడ్డి మరియు సిబ్బందిని రెస్క్యూ టీం గా ఏర్పాటు చేసి, అర్జంటుగా ఆ స్థలానికి వెళ్లి ఆ పిల్లి ని కాపాడే ప్రయత్నం చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
అక్కడికి చేరుకున్న పోలీస్ రెస్క్యూ టీం అంజి రెడ్డి హెడ్ కానిస్టేబుల్ మరియు సిబ్బంది బావిలోకి ఒక బుట్టను తాడు సహాయంతో పంపించి, ఆ బుట్టలో పిల్లి కూర్చునే విధంగా ప్రయత్నించి…… పిల్లి బుట్టలో కూర్చున్న తర్వాత దాన్ని సురక్షితంగా పైకి లాగి రక్షించడం జరిగింది.సమయం అర్ధరాత్రి 12:30 మరియు 12:45 గంటలకు రెస్క్యూ ఆపరేషన్ పూర్తయింది.పోలీసులు సంతోషంతో పిల్లిని యజమానికి అప్పగించగా, ఆ పిల్లి యజమాని ఆనందంతో పోలీసు లకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది.ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ… ఆపదలో ఉన్న సమయంలో ప్రజలు అర్ధరాత్రి రెండు గంటల కైనా డయల్@100 నంబర్ కి కాల్ చేస్తే పోలీసులు వెంటనే స్పందించి, ఆ ఆపద నుండి కాపాడతారని , ఎల్లవేళలా పోలీసులు ప్రజల సంరక్షణ కోసం ఉన్నారని తెలియజేయడం జరిగింది.







