సినీ నటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.కులం అంటే తనకు అసహ్యమన్న ఆయన తాను ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడే అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడినట్లు తెలిపారు.
టీ అంగళ్లలో రెండు గ్లాసుల విధానాన్ని అప్పటిలోనే వ్యతిరేకించానని మోహన్ బాబు పేర్కొన్నారు.ఆ సమయంలో టీ దుకాణ యజమానిని తిట్టడంతో అప్పుడు పెద్ద పంచాయతీ జరిగిందని తెలిపారు.
తనను వాళ్ల నాన్న సముదాయించారన్నారు.అయితే కుల పిచ్చి ఇప్పుడు మరీ ఎక్కువ అయిందన్న మోహన్ బాబు ఇది సర్వ నాశనానికి దారి తీస్తుందని వెల్లడించారు.