ఎప్పుడు ఏదో వివాదంలో గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు వినిపిస్తూనే ఉంటుంది.ముఖ్యంగా హిందుత్వం విషయంలోనూ, గో అక్రమ రవాణాను అడ్డుకోవడంలోనూ ఎప్పుడు రాజాసింగ్ ముందుంటూ ఉంటారు.
ఇక గత కొంతకాలంగా ఎంఐఎం పైన విమర్శలు చేస్తూ వార్తల్లో ఉంటున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు రాజా సింగ్ పై పిడిఎఫ్ నమోదయింది.
తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఓ ఎమ్మెల్యేపై పిడి యాక్ట్ కేసు నమోదవడం సంచలనంగా మారింది.దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించారనే ఆరోపణలు చేస్తూ రాజాసింగ్ పై పోలీసులు పీడీ యాక్ట్ కేసు నమోదు చేశారు.
ముఖ్యంగా ఓ మతాన్ని కించపరుస్తూ రెచ్చగొట్టే ఆరోపణలు చేశారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేశారు.దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో భాగంగా ఆయనపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం రాజసింగ్ గోషామహల్ లోని ధుల్ పేట్ లో నివాసం ఉంటున్నారు.ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉన్నారు.రాజాసింగ్ పై ఇప్పటివరకు మొత్తం 101 కేసులు నమోదు అయ్యాయి.ఆ కేసుల్లో 18 కేసులు మత విద్వేషాలను రెచ్చగొట్టిన కేసులు.
అలాగే దేశవ్యాప్తంగా 42 కేసులు నమోదయ్యాయి 2014, 18 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తరఫున ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.ఇక గోషామహల్ నియోజకవర్గం పరిధితో పాటు, దేశ వ్యాప్తంగా రాజాసింగ్ పై కేసులు ఉన్నాయి.
షాహి నాయత్ గంజ్, మంగళహాట్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్లు ఉన్నాయి.

ఇప్పటికే ఆయనను మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆరోపణలు చేయవద్దని పోలీసులు అనేకమార్లు సూచనలు చేశారు.అయినా ఆయన ఈనెల 23వ తేదీన మహమ్మద్ ప్రవక్త వ్యాఖ్యలు చేయడం దానిపై పెద్ద ఎత్తున దుమారం రేగడం తో పోలీసులు అరెస్ట్ చేశారు.అయితే 41 సి ఆర్ పీ సి కింద నోటీసులు ఇవ్వలేదని కారణంతో రాజాసింగ్ కోర్టు విడుదల చేసింది .దీంతో షాహినాత్ గంజ్ పోలీసులు గురువారం 41 సీఆర్ పిసీ కింద నోటీసులు జారీ చేశారు.అలాగే మంగళహాట్ పోలీస్ స్టేషన్ లో గతంలోనే రాజాసింగ్ పై రౌడీషీట్ ఉన్నట్లు పోలీసులు పేర్కొనడంతో పాటు, ఆయనపై ఉన్న కేసులు ఆధారంగా పీడీ యాక్ట్ పెట్టినట్లు సమాచారం.







