దేవరకొండ పరిధిలో కలకలం రేపుతున్న ఫుడ్ పాయిజన్ కేసులు

నల్లగొండ జిల్లా:దేవరకొండ నియోజకవర్గ పరిధిలో వరుసగా నమోదవుతున్న ఫుడ్ పాయిజన్ కేసులు కలకలం రేపుతున్నాయి.

రెండు రోజుల క్రితం పీఏ పల్లి ఘటన మరువక ముందే దేవరకొండ మండలం పెంచికల్ పహాడ్ మోడల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ తో ఐదుగురు విద్యార్దులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన మరో ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది.

దీనితో దేవరకొండ నియోజకవర్గ పరిధిలో అసలు ఏం జరుగుతుందో అంతుచిక్కడం లేదు.మోడల్ స్కూల్లో ఉడికీ ఉడకని మధ్యాహ్న భోజనం తినడంతోనే ఐదుగురు విద్యార్థులకు కడుపునొప్పి వచ్చిందని, హుటాహుటిన వారిని దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Cases Of Food Poisoning Causing A Stir In Devarakonda , Devarakonda , Cases, Foo

ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ఆసుపత్రికి చేరుకొని విద్యార్థులను పరామర్శించి,వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.రాష్ట్రంలో రోజురోజుకూ విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురై చావు బ్రతులతో అల్లాడి పోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు.

అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోన్న కారణంగానే ప్రభుత్వ వైద్య సంస్థల్లో ఈ పరిస్థితి వస్తుందని మండిపడ్డారు.ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కళ్ళు తెరిచి ఫుడ్ పాయిజన్ కు గల కారణాలు ఏమిటి?ఎందుకు వరుస ఘటనలు జరుగుతున్నాయి? సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

తాజా వార్తలు