అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులపై కేసు నమోదు అయింది.తాడిపత్రిలో టీడీపీ నేత నారా లోకేశ్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర విజయవంతం కావడంతో పార్టీ శ్రేణులు సంబురాలు చేశారు.
ఈ నేపథ్యంలో పోలీసులు వద్దని వారించినా టీడీపీ నేతలు టపాసులు కాల్చారు.దీంతో నిబంధనలు ఉల్లంఘిచారని జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.286, 290 ఆర్/డబ్ల్యూ ఐపీసీ సెక్షన్ 9 (బి) (1) (బి) ఎక్స్ ప్లోజివ్ యాక్ట్ కింద కేసు బుక్ చేశారు.







