చిగుళ్ల వాపును రెండు రోజుల్లో త‌గ్గించే క్యారెట్‌.. ఎలాగో తెలుసా?

చిగుళ్ల వాపు.పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా ఎంద‌రినో తీవ్రంగా వేధించే కామ‌న్ స‌మ‌స్య ఇది.

బ్యాక్టీరియా, నోటి శుభ్ర‌త లేక‌పోవ‌డం, పోష‌కాల కొరత‌, మ‌ధుమేహం, ప్రెగ్నెన్సీ, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, ఆహార‌పు అల‌వాట్లు వంటి కార‌ణాల వ‌ల్ల చిగుళ్ల వాపుకు గుర‌వుతుంటారు.అయితే కార‌ణం ఏదైనా క్యారెట్‌తో ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా చేస్తే చాలా అంటే చాలా సుల‌భంగా చిగుళ్ల వాపును నివారించుకోవ‌చ్చు.

అవును, మీరు విన్న‌ది నిజ‌మే.ఆరోగ్య ప‌రంగా, సౌంద‌ర్య ప‌రంగా క్యారెట్ ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంద‌ని అంద‌రికీ తెలుసు.

అలాగే క్యారెట్‌లో ఉండే కొన్ని ప్ర‌త్యేక‌మైన పోష‌కాలు చిగుళ్ల వాపును కూడా నివాస్తుంది.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం ప‌దండీ.

ముందుగా ఒక తాజా క్యారెట్ తీసుకుని పీల్ తొల‌గించి నీటిలో శుభ్రంగా క్లీన్ చేసుకుని ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.ఈ ముక్క‌లు మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా పేస్ట్ చేసి జ్యూస్‌ను మాత్రం స‌ప‌రేట్ చేసుకోవాలి.

Advertisement
Carrot Helps To Get Rid Of Swollen Gums! Carrot, Swollen Gums, Latest News, Gums

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల క్యారెట్ జ్యూస్‌, హాఫ్‌ టేబుల్ స్పూన్ స‌చ్ఛ‌మైన ప‌సుపు, వ‌న్ టేబుల్ స్పూన్ అల్లం ర‌సం వేసి క‌లుకోవాలి.

Carrot Helps To Get Rid Of Swollen Gums Carrot, Swollen Gums, Latest News, Gums

చివ‌ర‌గా ఇందులో వ‌న్ టేబుల్ స్పూన్ మీ రెగ్యుల‌ర్ టూత్ పేస్ట్‌ను వేసి ఐదు నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని చిగుళ్ల‌కు, దంతాల‌కు అప్లై చేసి బ్రెష్‌తో కాకుండా చేతి వేళ్ల‌తోనే స్మూత్‌గా రెండు నుంచి మూడు నిమిషాల పాటు ర‌బ్ చేసుకోవాలి.ఆపై గోరు వెచ్చని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఇలా రోజుకు ఒక సారి చేస్తే గ‌నుక కేవ‌లం రెండంటే రెండు రోజుల్లోనే చిగుళ్ల వాపు నుంచి ఉప‌శ‌మ‌నం పొందొచ్చు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు