యాల‌కుల‌తో ఇలా చేస్తే నోటి పూత రెండు రోజుల్లో త‌గ్గిపోతుంది..తెలుసా?

నోటి పూత.వ‌య‌సుతో సంబంధం లేకుండా ఎంద‌రినో వేధించే స‌ర్వ సాధార‌ణ స‌మ‌స్య ఇది.

శ‌రీరంలో అధిక వేడి, నీటిని స‌రిగ్గా తీసుకోక‌పోవ‌డం, ప‌లు పోష‌కాల కొర‌త‌, నోటి శుభ్ర‌త లేక‌పోవ‌డం, నోట్లో బ్యాక్టీరియా పేరుకు పోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల‌ చిగుళ్లు, నాలుక, పెదవుల లోపల, దవడ లోపల చిన్న చిన్న పుండ్లు ఏర్ప‌డ‌తాయి.దీనినే నోటి పూత అని పిలుస్తారు.

ఇది చాలా చిన్న స‌మ‌స్యే అయిన‌ప్ప‌టికీ.దీని వ‌ల్ల భ‌రించ‌లేనంత నొప్పిని ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

ఇక పొర‌పాటున‌ కారం, పులుపు, ఉప్పు వంటివి నోటికి త‌గిలాయా.ఇక అంతే సంగ‌తులు.

Advertisement
Cardamom Can Reduce Mouth Ulcer Naturally! Cardamom, Mouth Ulcer, Latest News, H

అందుకే నోటి పూత అంటేనే భ‌య‌ప‌డిపోతుంటారు.నోటి పూత‌ను త‌గ్గించ‌డానికి ఎన్నో ర‌కాల మందులు అందుబాటులో ఉన్నాయి.

అలాగే స‌హ‌జ ప‌ద్ధ‌తుల్లోనూ ఈ స‌మ‌స్య‌ను నివారించుకోవ‌చ్చు.ముఖ్యంగా యాల‌కులు నోటి పూత‌ను త‌గ్గించ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

ప్ర‌త్యేక‌మైన రుచి, వాస‌న క‌లిగి ఉండే యాల‌కు‌ల్లో బోలెడ‌న్ని పోష‌కాలు నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్య ప‌రంగా యాల‌కులు ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.

Cardamom Can Reduce Mouth Ulcer Naturally Cardamom, Mouth Ulcer, Latest News, H

అలాగే యాల‌కుల‌కు నోటి పూత‌ను మ‌టుమాయం చేసే సామ‌ర్థ్యం కూడా ఉంది.అవును, ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా యాల‌కుల‌ను తీసుకుంటే రెండంటే రెండు రోజుల్లో నోటి పూత నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.యాల‌కులు, పాల‌మీగ‌డ‌.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

ఈ రెండిటి కాంబినేష‌న్ నోటి పూత‌ను త‌గ్గించ‌డంలో గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.ఒక స్పూన్ పాల మీగ‌డ‌కు పావు స్పూన్ యాల‌కుల పొడి క‌లిపి తీసుకోవాలి.

Advertisement

ఇలా ఉద‌యం, సాయంత్రం తీసుకుంటే నోటి పుండ్లు రెండు రోజుల్లోనే త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.మ‌రో విధంగా కూడా యాల‌కుల‌ను తీసుకుని నోటి పూత‌ను నివారించుకోవ‌చ్చు.

ఒక గ్లాస్ వాట‌ర్‌లో పావు స్పూన్ యాల‌కుల పొడి, అర స్పూన్ ప‌టిక బెల్లం పొడి క‌లిపి సేవించాలి.ఇలా రోజుకు ఒక సారి చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

" autoplay>

తాజా వార్తలు