నరసాపురం వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రస్తుతం రాజకీయ సందిగ్ధంలో ఉన్నారు.అధికారికంగా వైసీపీ ఎంపీగా ఆయన ఉన్నా, ఆ పార్టీతో సఖ్యత గా లేరు.
అదేపనిగా వైసిపి ప్రభుత్వాన్ని విమర్శించడంతోపాటు, జగన్ నిర్ణయాల పైన కోర్టులో పిటిషన్లు వేస్తూ మీడియా ముందు విమర్శలు చేస్తూ ఆ పార్టీకి కంటిలో నరుసుల మారారు.ఆయన వ్యవహార శైలి పై వైసీపీ తీవ్ర ఆగ్రహంతో ఉంది.
ఆయనపై అనర్హత వేటు వేయాల్సిందిగా లోక్ సభ స్పీకర్ కు వైసిపి ఎంపీలు ఫిర్యాదు చేశారు.అలాగే కేంద్ర బిజెపి పెద్దలకు అవకాశం దొరికినప్పుడల్లా సీఎం జగన్ బిజెపి పెద్దలను రఘురామ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూనే వస్తున్నారు.
అయితే చాలామంది బిజెపి ముఖ్య నాయకులతో సన్నిహితంగా మెలుగుతూ ఉండడంతో మరింత ఉత్సాహంగా ఏపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ వచ్చారు.తనకు బిజెపి పెద్దల వద్ద ఆ స్థాయిలో పలుకుబడి ఉంది అనే విషయాన్ని హైలెట్ చేసుకునేందుకు ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు.
అయితే రఘురాంకు ఏ స్థాయిలో పలుకుబడి ఉందనే విషయం ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం పర్యటనకు వచ్చినప్పుడు తేలిపోయింది అంటూ వైసీపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపికి జగన్ అవసరం చాలా ఉంది.2024 లో మళ్ళీ ఎన్నికల అనంతరం బిజెపి ప్రభుత్వం ఏర్పడాలంటే జగన్ మద్దతు అవసరం అవుతుందని ముందస్తు ఆలోచనలో బిజెపి పెద్దలు ఉండడంతోనే ఆ స్థాయిలో ఎప్పటి నుంచో జగన్ కు ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలోని ప్రధాని భీమవరం పర్యటన సందర్భంగా స్థానిక ఎంపీ కోటలో రఘురామకు ఆహ్వానం అందించాల్సి ఉన్నా… పీఎంవో అధికారులు ఆయన పేరును జాబితాలో చేర్చలేదని తెలుస్తోంది.దీంతో బిజెపిలో చేరాలని మొదటి నుంచి భావిస్తూ వస్తున్నా, ఆ పార్టీలో చేరే అవకాశం కనిపించడం లేదు.ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజెపి పెద్దలు ఎవరు రఘురామకు సహకరించే అవకాశం కనిపించకపోవడంతో రాబోయే ఎన్నికల్లో రఘురామ రాజకీయ జీవితం ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.
తాను మళ్లీ నరసాపురం నియోజకవర్గంలో నుంచి ఎంపీగా పోటీ చేస్తానని , వైసిపి అభ్యర్థి పై గెలిచి తీరుతానంటూ రఘురామ శపదాలు చేస్తున్నారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టిడిపి, జనసేన మాత్రమే ఆయనకు ఆప్షన్ గా కనిపిస్తున్నాయి.
టిడిపి జనసేన అధ్యక్షులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో రఘురామకు సాహిత్యం ఉంది.అనేక సందర్భాల్లో రఘురామను పొగుడుతూ ఇరు పార్టీల అధ్యక్షులు ప్రకటనలు చేశారు ఈ నేపథ్యంలో టిడిపి, జనసేన ఏదో ఒక పార్టీలో చేరాల్సిన పరిస్థితి ఆయనకు ఏర్పడింది.
ఎన్నికల సమయం నాటికి టిడిపి జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుంటే రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా రఘురామకు అవకాశం ఉంటుంది.ఆ విధంగా జరగాలన్నా ఈ రెండు పార్టీల్లో ఒకదాన్ని ఆయన ఎంచుకోవాల్సి ఉంటుంది.







