రాజకీయ పార్టీకి ఎంత బలమైన సిద్ధాంతాలు ఉన్న వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల అంగీకారం పొంది విజయం తీసుకురావాల్సింది ఎమ్మెల్యే అభ్యర్థులే.అందువల్లే పార్టీ బలహీనంగా ఉన్నప్పటికీ అభ్యర్థుల సమర్థతతో గెలవబడే నియోజకవర్గాలు ఉంటాయి.
పార్టీ ఎంత బలంగా ఉన్నా అభ్యర్థి అసమర్ధుడు అయితే గెలుపు కష్టతరంగా మారుతుంది .తెలంగాణలో( Telangana ) వచ్చే మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నందున అభ్యర్థుల లిస్టును పార్టీలు ఫైనల్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.2018లో కూడా ముందస్తుకు వెళ్లి మంచి ఫలితం సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి కూడా ప్రతిపక్షాల కంటే ముందే తమ అభ్యర్థుల లిస్టు ఫైనల్ చేయనున్నట్లుగా తెలుస్తుంది ఆగస్టు మూడో వారానికల్లా 90% సీట్లలో అభ్యర్థులను ప్రకటిస్తారని ,ఇప్పటికే ప్రభుత్వ ఇంటెలిజెన్స్ నివేదికలతో పాటు ప్రైవేట్ సర్వే రిపోర్ట్లను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసిన కేసీఆర్ తన అభ్యర్థులను లిస్టు ఫైనల్ చేసుకున్నారని, పార్టీలోని కీలక నేతలతో చర్చించి ఫైనల్ లిస్టును ఈ నెల మూడో వారంలో ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి .

మరోవైపు కాంగ్రెస్( Congress ) కూడా అభ్యర్థుల లిస్టును వడపోసే ప్రక్రియను మొదలు పెట్టిందని అయితే అంతర్గత తిరుగుబాట్లు లాంటి పరిస్థితులు ఉత్పన్నమవ్వకుండా ముందుగానే అభ్యర్థులకు పోటీపై సంకేతాలు ఇవ్వటంతో పాటు సీటు దక్కని వారికి భవిష్యత్తుపై హామీ ఇచ్చి వారిని బుజ్జగించే ప్రక్రియను మొదలుపెట్టిన తర్వాతే అభ్యర్థుల ప్రకటించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.ఇప్పటి కే అనేక వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చేయబోయే హామీలను భారీ స్థాయిలో కుప్పించిన కాంగ్రెస్ గెలుపు పై నమ్మకంగానే ఉంది.

మరో వైపు బీజేపీ( BJP ) కూడా తమ అభ్యర్థుల లిస్టు నుండి ఫైనల్ చేసుకునే ప్రక్రియలో పడినట్లుగా తెలుస్తుంది ఇప్పటికే ఎన్నికల కమిటి చైర్మన్ డిల్లీ పిలిపించుకున్న భాజాపా అధిష్టానం అభ్యర్థులు ఎంపికపై కసరత్తు మొదలు పెట్టినట్టుగా తెలుస్తుంది.కొత్త అధ్యక్షుడు సూచించిన పేర్లతో పాటు మొన్నటి వరకు కీలకంగా పనిచేసిన బండి సంజయ్ సూచించిన అభ్యర్థులను కూడా పరిశీలించి అందరికి ఆమోదయోగ్యమైన లిస్టు ఫైనల్ చేయాలని బాజాపా అధిష్టానం చూస్తున్నట్లుగా తెలుస్తుంది.అయితే అధికారం చేతిలో ఉండటంతో ఇప్పటికే ఆయా వర్గాలకు భారీ స్థాయి వరాలు ఇచ్చిన అధికార బారాస రేసులో కొద్దిగా ముందు ఉన్నట్లుగా తెలుస్తుంది .ఆర్టీసీ కార్మికుల( RTC workers ) చిరకాల కోరిక తీర్చడంతో పాటు దివ్యాంగుల పెన్షన్ పెంచడం బీసీ చెక్కులను పంపిణీ చేయడంతో పాటు వచ్చే మూడు నెలల కాలంలో మరిన్ని ప్రజా ప్రయోజన పథకాలను ప్రవేశపట్టడం ద్వారా లబ్ధి పొందాలని అధికార పార్టీ చూస్తున్నట్లుగా తెలుస్తుంది.