ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లున్న భారతీయ విద్యార్ధులు అక్కడ అనుకోని ప్రమాదాల బారినపడి ప్రాణాలు వీడుస్తున్నారు.దీంతో కన్నవారికి కడుపు కోత మిగులుతోంది.
రోడ్డు ప్రమాదాలు, ఉన్మాదుల కాల్పులు, విహారయాత్రల్లో ప్రమాదాలు వంటి వాటిలో భారతీయ విద్యార్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు.నిత్యం ప్రపంచంలో ఏదో ఒక మూల ఇలాంటి ఘటనలు జరుగుతూనే వున్నాయి.
తాజాగా గుజరాత్‌కు( Gujarat ) చెందిన ఓ విద్యార్ధి కెనడాలోని( Canada ) శవమై తేలాడు.
వివరాల్లోకి వెళితే.
బాధిత విద్యార్ధి మే 5న అదృశ్యమై.మే 7న టోరంటోలోని( Toronto ) ఓ బ్రిడ్జి కింద శవమై తేలాడు.
మృతుడిని ఆయుష్ దంఖారా (23)గా( Ayush Dankhra ) గుర్తించారు.అతని మరణవార్తను మిత్రులు భారత్‌లోని తల్లిదండ్రులకు తెలియజేశారు .తమ బిడ్డ ఉన్నత చదువులు చదివి గొప్పవాడు అవుతాడని అనుకుంటే.తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఆయుష్ తండ్రి రమేశ్ దంఖారా గుజరాత్‌లోని భావ్‌నగర్ డీఎస్పీగా పనిచేస్తున్నారు.ఈ క్రమంలో ఆయుష్ ఉన్నత చదువుల కోసం కెనడా వచ్చి టొరంటోలోని యార్క్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు.

అయితే అంతకుముందు గుజరాత్‌కే చెందిన ఒక విద్యార్ధి ఏప్రిల్ నెలలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు.అతనిని అహ్మదాబాద్‌కు చెందిన హర్ష్ పటేల్‌గా గుర్తించారు.ఇప్పుడు తాజాగా ఆయుష్ కూడా అదే రీతిలో ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది.ఇద్దరూ గుజరాత్‌కు చెందినవారే , ఇద్దరూ యార్క్ యూనివర్సిటీలోనే చదువుతున్నారు, అలాగే ఇద్దరి మృతదేహాలు నీటి గుంతల సమీపంలోనే దొరికాయి.
ఆశ్చర్యకరంగా వీరిద్దరి ఫోన్‌లు కనిపించలేదు.దీంతో వీరి మరణం వెనుక ఏదైనా మిస్టరీ వుందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు .ఆయుష్ గాంధీనగర్‌లో ప్లస్ 2 వరకు చదువుకుని.కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్సు కోసం యార్క్ యూనివర్సిటీకి వెళ్లినట్లు అతని మామయ్య నరన్ దంఖారా జాతీయ మీడియా సంస్థకు తెలిపారు.ఆయుష్ టొరంటోలోని ఒక అపార్ట్‌మెంట్‌లో మిత్రులతో కలిసి నివసిస్తున్నాడని.
ఈ క్రమంలో అతను ఒకరోజు అదృశ్యమైనట్లు ఆయుష్ రూమ్ మెట్ తమకు సమాచారం అందించినట్లు నరన్ తెలిపారు.దీంతో టొరంటో పోలీసులకు ఫిర్యాదు చేశామని.ఈ క్రమంలో మే 7న ఓ వంతెన కింద ఆయుష్ మృతదేహం లభ్యమైందని ఆయన చెప్పారు.







