వింట‌ర్ లో మార్నింగ్ వాక్ కు వెళ్తున్నారా.. అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి!

సాధారణంగా మార్నింగ్ వాక్ అనేది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

రోజు ఉదయం కాసేపు వాకింగ్ చేయడం వల్ల మన మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది.

మైండ్ రిఫ్రెష్ అవుతుంది.ఒత్తిడి దూరం అవుతుంది.

అలాగే మార్నింగ్ వాక్ వల్ల మన ఎనర్జీ లెవెల్స్ సహజంగానే పెరుగుతాయి.మధుమేహం ( Diabetes )వచ్చే రిస్క్ తగ్గుతుంది.

వెయిట్ లాస్ అవుతారు.ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.

Advertisement
Can You Go For A Morning Walk In Winter , Morning Walk, Morning Walk Health

ఇలా చెప్పుకుంటూ పోతే మార్నింగ్ వాక్ వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి.

Can You Go For A Morning Walk In Winter , Morning Walk, Morning Walk Health

అందుకే చాలా మంది మార్నింగ్ వాక్( Morning walk ) ను త‌మ డైలీ రొటీన్ లో భాగం చేసుకుంటారు.అయితే ప్రస్తుత చలికాలంలో ( Winter )ఉదయం వేళ మంచు అధికంగా ఉంటుంది.అందువల్ల వింటర్ లో మార్నింగ్ వాక్ చేయవచ్చా.? చేయకూడదా.? అనే డౌట్ ఎంతో మందికి ఉంటుంది.వాస్తవంగా చెప్పాలంటే ఆస్తమా, న్యుమోనియా, గుండె సమస్యలు ఉన్నవారు ఈ చలికాలంలో మార్నింగ్ వాక్ ను స్కిప్ చేయడమే ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు.

ఇలాంటి వారు సాయంత్రం వేళ వాకింగ్ కు వెళ్లొచ్చు.వీరు మినహా మిగిలిన వారంతా మార్నింగ్ వాక్ చేయ‌వ‌చ్చు.అయితే కొన్ని జాగ్రత్తలు మాత్రం కచ్చితంగా పాటించాలి.

వింట‌ర్‌ సీజన్ లో ఉదయం వేళ వాకింగ్ చేయడానికి వెళ్లేవారు ఎక్కువ బరువు మరియు టైట్ గా ఉండే దుస్తులు వేసుకోకూడదు.

Can You Go For A Morning Walk In Winter , Morning Walk, Morning Walk Health
ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

కొంచెం లైట్ వెయిట్ మరియు వదులుగా ఉండే దుస్తులు ధరించాలి.ఆ దుస్తులు మీకు మంచి వెచ్చదనాన్ని అందించే విధంగా ఉండాలి.అలాగే చెవుల్లోకి గాలి వెళ్లకుండా తలకు క్యాప్‌, చేతులకు గ్లౌసులు మరియు కాళ్ళకు షూస్‌ వేసుకోవాలి.

Advertisement

అలాగే ఖాళీ కడుపుతో వాకింగ్ చేయడం కరెక్ట్ కాదు.కనీసం వాటర్ అయినా తీసుకుని వాకింగ్ కు బయలుదేరాలి.

సూర్య రశ్మి వస్తున్న టైం లో నడిస్తే ఇంకా మంచిది.

తాజా వార్తలు