తెలంగాణలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను( Assembly elections ) అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు తీసుకోవడంతో పోరు హోరా హోరీ గా ఉండేలా కనిపిస్తోంది.ఇప్పటికే బీఆర్ఎస్ , కాంగ్రెస్ ( BRS, Congress )లు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుండడంతో బిజెపి కూడా స్పీడ్ పెంచింది.
ఆ రెండు పార్టీలకు తెలంగాణలో అవకాశం లేకుండా చేసి అధికారంలోకి రావాలనే పట్టుదలతో బిజెపి ఉంది.దీంతో పాటు బిజెపి తెలంగాణలో అధికారంలోకి వస్తే ప్రజలకు ఎంత మేలు జరుగుతుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు మొదలుపెట్టారు .ఇక ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉదృతం చేసేందుకు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.ఇప్పటికే ఎన్నికల ప్రచార కమిటీ ని కూడా ప్రకటించారు.
ఆ జాబితాలో ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోది( Prime Minister Narendra Modi ) ఉన్నారు .ఆ తరువాత జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ , నితిన్ గట్కరి ఉన్నారు.జాతీయ అధ్యక్షులతో పాటు, కేంద్ర మంత్రులు కూడా ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మహిళా మంత్రులు నిర్మల సీతారామన్, స్మృతి ఇరానీ కూడా పాల్గొనబోతున్నారు.
దీంతో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్, బండి సంజయ్ , ఈటెల రాజేందర్ పాల్గొన్నారు.

బిజెపి తరఫున ఎన్నికల ప్రచారం చేసేవారి జాబితా నరేంద్ర మోది, జేపీ నడ్డా , రాజ్ నాథ్ సింగ్ , అమిత్ షా , నితిన్ గట్కరి , యడ్యూరప్ప, లక్ష్మణ్ ,యోగి ఆదిత్యనాథ్, నిర్మల సీతారామన్ , స్మృతి ఇరానీ, పురుషోత్తం రూపాల, అర్జున్ ముండ , భూపేంద్ర యాదవ్ , కిషన్ రెడ్డి ,సాధ్వి నిరంజన్ , జ్యోతి మురుగన్ , ప్రకాష్ జగదేకర్, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, బండి సంజయ్ , అరవింద్ మీనన్, డీకే అరుణ , మురళీధర్ రావు , పురందరేశ్వరి , రవి కిషన్, పొంగులేటి సుధాకర్ రెడ్డి , జితేంద్ర రెడ్డి, గరికపాటి మోహన్ రావు, ఈటెల రాజేందర్ , ధర్మపురి అరవింద్ , సోయం బాపూరావు , రాజాసింగ్ , కొండ విశ్వేశ్వర్ రెడ్డి, నరసయ్య గౌడ్, ప్రేమేందర్ రెడ్డి ,ప్రదీప్ కుమార్, వెంకటేశ్వర్లు యాదవ్, కృష్ణ ప్రసాద్ లు ఉన్నారు.







