జంతువులకు సంబంధించిన వీడియోలు మనలను అలరిస్తుంటాయి.జంతువులు చేసే అల్లరి చాలా సరదాగా ఉంటుంది.
మీరు రోజూ పనిలో ఏదైనా అలసటగా ఉన్నప్పుడు ఇలాంటి వీడియోలు చూస్తే కొంచెం ఊరట కలుగుతుంది.మీ మనస్సును రిఫ్రెష్ చేస్తుంది.
అలాంటి ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అందులో మీరు ఒంటె ఆనందాన్ని చూస్తూ ఉండిపోతారు.
ఇన్‌స్టాగ్రామ్ లోని ranchogrande_ojaiలో పోస్ట్ చేసిన ఓ వీడియో నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది.వీడియోలో ఒంటె ఆనందాన్ని చూసి మీరు కూడా ఉప్పొంగిపోతారు.
దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్లాలని అందరికీ ఉంటుంది.
ఉన్నత వర్గాల ప్రజలు తరచూ విదేశాలకు ముఖ్యంగా మాల్దీవులు వంటి ప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు.కొత్త ప్రాంతాన్ని, పర్యాటక ప్రాంతాలను చూస్తే కలిగే ఆనందమే వేరు.
ఇదే అనుభవం జంతువులకు కూడా ఉంటుంది.ఎడారి ఓడగా పిలుచుకునే ఒంటె తొలిసారిగా మంచును చూసి సంతోషంతో గంతులు వేసింది.
ఎగిరి గంతేస్తూ ఆనందం వ్యక్తం చేయడం కనిపించింది.ఎడారి జంతువు మంచును చూసి ఎగిరి గంతులేస్తూ సంతోషం వ్యక్తం చేసింది.
ఎప్పుడూ ఇసుకలో గడిపిన ఆ ఒంటె తొలిసారి మంచును చూడడంతో దాని ఆనందానికి అవధులు లేవు.

మంచుతో కప్పబడిన పర్వతం అంతా సంతోషంతో కలియ తిరిగింది.వీక్షకులను మంత్రముగ్ధులను చేసేలా ఆ వీడియో ఉంది.దీనిని చూసిన నెటిజన్లు ఆ ఒంటె సంతోషం గురించి కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పటికే ఈ వీడియోకు 71 వేలకు పైగా వ్యూస్ దక్కాయి.







