అమెరికన్‌ భార్య భర్తలకు 4.2 కోట్ల ఫైన్‌... అలా ఇండియాలో ఫైన్‌లు వేస్తే వేల కోట్లు వసూళ్లు అవుతాయేమో

అమెరికన్స్‌ పకృతిని ప్రేమిస్తారు, అక్కడి ప్రభుత్వాలు పకృతి అందంగా ఉండేందుకు చాలా కృషి చేస్తుంది.ఎవరైనా పకృతికి హాని కలిగించేలా చూస్తే కఠినంగా వ్యవహరిస్తారు.

అక్కడ పెద్ద చెట్లను తొలగించేందుకు చాలా రకాల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.ఇక ఆ చెట్టును మరో చోట పెట్టి, దాన్ని బతికించాల్సిందే.

ఇష్టం వచ్చినట్లుగా చెట్లను నరకడం అక్కడ చట్ట విరుద్దం.తాజాగా ఒక అమెరికన్‌ జంట ఒక పెద్ద చెట్టును తాము ఉన్న ప్రాంతం నుండి మరో ప్రాంతంకు తరలించారు.

అయితే ఆ క్రమంలో వారి పూర్తి జాగ్రత్తలు తీసుకోకపోవడమో లేదంటే అశ్రద్దగా ఉండటం వల్లనో కాని మరో చోట పెట్టినా కూడా ఆ చెట్టు బతకలేదు.

California Couple Must Pay Nearly 600k
Advertisement
California Couple Must Pay Nearly 600k-అమెరికన్‌ భార్

చెట్టును చంపేసిన కారణంగా ఆ జంటకు ఏకంగా 6 లక్షల డాలర్ల జరిమానా విధించడం జరిగింది.ఇండియన్‌ కరెన్సీ ప్రకారం ఏకంగా 4.2 కోట్లు.ఇంత భారీ మొత్తంలో జరిమానా విధించారు అంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అక్కడ మామూలుగానే చెట్లకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు.అలాంటిది ఆ చెట్టు 180 ఏళ్ల చరిత్ర ఉన్న చెట్టు.

ఆ చెట్టును స్థానికులు చాలా ప్రత్యేకంగా చూస్తారు.అలాంటి చెట్టును నేల కూల్చడంతో ఆ జంటపై తీవ్రమైన విమర్శలు వచ్చి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి.

అందుకే ఆ జంటకు కోర్టు ఏకంగా నాలుగు కోట్లకు పైగా జరిమానా విధించింది.

California Couple Must Pay Nearly 600k
మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి

ఇండియాలో అలా చెట్లను చంపేస్తే, చెట్లను నరికేస్తే జరిమానాలు విధించినట్లయితే సంవత్సరంకు కొన్ని వందల కోట్లు జరిమానాల రూపంలో వచ్చే అవకాశం ఉంది.ఇండియాలో చెట్లను నరకడం చట్ట విరుద్దమే, కాని ఆ చట్టం పెద్దగా పట్టించుకోవడం లేదు.చెట్లను నరికేస్తే కఠినంగా వ్యవహరించాలి.

Advertisement

కాని ఇండియాలో మాత్రం అలా వ్యవహరించడం లేదు.ఇలాగే ఇంకా కొన్నాళ్లు కొనసాగితే చెట్లు అనేవి కనిపించవేమో అనే భయం కలుగుతుంది.

చెట్లు లేని ప్రపపంచ నాశనంకు దారితీస్తుందని పర్యావరణ నిపుణులు అంటున్నారు.అందుకే తప్పకుండా ప్రతి ఒక్కరు చెట్లను పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

పర్యావరణ ప్రేమికులు ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని స్నేహితులతో షేర్‌ చేయండి.

తాజా వార్తలు