తెలుగు ఫిలిం చాంబర్ ఎన్నికలు ముగిసాయి.ఈ ఎన్నికలలో నిర్మాత సి కళ్యాణ్ ప్యానల్ విజయం సొంతం చేసుకుంది.
దిల్ రాజు నేతృత్వంలోనే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ప్యానల్ నుంచి నలుగురు గెలిచారు.ఇండిపెండెంట్ గా పోటీ చేసిన మోహన్ గౌడ్ కూడా గెలిచారు.
మొత్తం 20 మంది సెక్టార్ మెంబెర్స్‌లో మొత్తం 16 మంది సి కళ్యాణ్ ప్యానెల్ నుంచి గెలుపొందడం విశేషం.ఇక రెగ్యులర్ గా సినిమాలు తీసేవారు దిల్ రాజు నేతృత్వంలో యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ప్యానల్ లో చేరి పోటీ చేయగా కేవలం నలుగురు మాత్రమే విజయం సొంతం చేసుకున్నారు.
చాంబర్ మీద పట్టు కోసం ప్రయత్నం చేసిన దిల్ రాజుకి నిరాశ తప్పలేదు.
ఈ చాంబర్ ఎన్నికలలో మొత్తం 1438 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటింగ్ కొనసాగుతుండగా ఒకానొక దశలో నిర్మాతల మధ్య పెద్ద గొడవ చోటు చేసుకుంది.ఇరు ప్యానెళ్ల సభ్యులు వాదించుకోవడంతో కాసేపు ఉద్రిక్తత చాంబర్ కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది.
నిర్మాతల మధ్య ఉన్న వివాదాల నేపధ్యంలో ఈ గొడవలు ఎక్కువయ్యాయి.దిల్ రాజు నేతృత్వంలో కొంత మంది చాంబర్ నిర్ణయాలతో సంబంధం లేకుండా సొంత అజెండాతో వెళ్ళడంపై చిన్న నిర్మాతలు గొడవకి దిగారు.
అయితే ఈ ఫిలిం చాంబర్ ఎన్నికలు ఏదో నామ మాత్రంగానే జరిగాయి తప్ప దీని వలన ఒరిగేది ఏమీ ఉండదని ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ నడుస్తుంది.బడా నిర్మాతలు ఎప్పటిలానే తమ పంథాలోనే చాంబర్ నిర్ణయాలకి వ్యతిరేకంగా పని చేస్తారని టాక్ వినిపిస్తుంది.







