ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.ఈ సారి ఎన్నికల్లో టీడీపీ -జనసేన( TDP, Jana Sena ) పొత్తుగా బరిలో నిలుస్తాయని ప్రకటించిన పార్టీ అధినేతలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) నిర్వహించిన ‘రా కదలి రా’ కార్యక్రమంలో భాగంగా మండపేట అభ్యర్థిని ప్రకటించారు.ఈ క్రమంలో టీడీపీ అభ్యర్థుల ప్రకటనపై స్పందించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పొత్తు ధర్మాన్ని టీడీపీ విస్మరించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.రిపబ్లిక్ వేడుకలకు హాజరైన ఆయన ఒక్కసారిగా బాంబ్ పేల్చారనే చెప్పుకోవచ్చు.
అయితే దీనిపై ప్యాకేజ్ లో ఏమైనా తేడా వచ్చిందా? లేదా పవన్ వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అసలు జనసేనాని వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటనే దానిపై రాష్ట్ర రాజకీయాల్లో వాడీవేడీగా చర్చ జరుగుతుంది.
టీడీపీ పొత్తు ధర్మాన్ని పాటించలేదన్న పవన్ కల్యాణ్( Pawan Kalyan ) తాను చాలా సహనంతో ఉన్నానని చెప్పుకొచ్చారు.అయితే చంద్రబాబు తరహాలోనే తనపై కూడా కొన్ని సందర్భాల్లో ఒత్తిడి ఉంటుందని ఝలక్ ఇచ్చారు.గత కొన్ని రోజులుగా టీడీపీ అనుసరిస్తున్న తీరుపై జనసేన పార్టీ శ్రేణులు కాస్త అసంతృప్తిగానే ఉంటున్నారు.
టీడీపీ వల్ల జనసేనకు కలిసి వచ్చే అంశాలు కనిపించడం లేదని, జనసేన వలనే టీడీపీకి లాభం అని చెప్పుకుంటున్నారని తెలుస్తోంది.మునిగిపోతున్న నావకు జీవం పోసినట్లుగా టీడీపీకి జనసేన పార్టీనే జీవం పోసిందని జన సైనికులు చెబుతూనే ఉన్నారు.
అయితే ఈ విషయం తెలిసినా పవన్ మాత్రం వారి గొంతునొక్కి ముందుకు సాగారు.అంతేకాదు టీడీపీతో పొత్తు నచ్చని వారు పార్టీని వీడి వెళ్లిపోవచ్చని తెలిపారు.ఆ సమయంలోనే జన సైనికులకు అసహనం వచ్చిందని చెప్పుకోవచ్చు.ఇన్నేళ్లుగా పార్టీ కోసం కష్టనష్టాలను ఎదుర్కొంటూ పని చేస్తున్న తమకు విలువ లేదని వాపోయారు కూడా.
ఇప్పుడు పొత్తు పేరుతో టీడీపీ( TDP ) జెండాలను కూడా మోయడానికి, బ్యానర్లు కట్టడానికి ఉన్నామా అంటూ కొందరు తిరగబడ్డ సందర్భాలు ఉన్నాయి.అదేవిధంగా సంఖ్యాపరంగా పెద్ద సామాజిక వర్గంగా ఉన్న కాపులు కొందరు జనసేనకు దూరమయ్యారు.
ఇష్టం లేని వారు వేరే పార్టీకి వెళ్ళిపోయారు.మరి కొంతమంది సైలెంట్ అయిపోయారు.
దీంతో జనసేనకు వచ్చిన హైప్ ఒక్కసారిగా తగ్గుతూ వచ్చింది.
తరువాత నారా లోకేశ్( Nara Lokesh ) సీఎం పదవిపై చేసిన వ్యాఖ్యలు జనసైనికుల్లో మరింత నిరాశను పెంచాయనే చెప్పుకోవచ్చు.అప్పటికీ మౌనంగానే ఉన్న జనసేనాని తాజాగా టీడీపీ అభ్యర్థులను ప్రకటించడంతో నోరు తెరిచారు.తనకున్న ఒత్తిడి కారణంగానే తాను కూడా అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు పవన్ తెలిపారు.
అంతేకాదు తనకు మొత్తం ఎన్ని స్థానాలు తీసుకోవాలో కూడా తెలుసన్నారు.ఏమీ తెలియకుండా తాను రాజకీయాల్లోకి రాలేదని తేల్చి చెప్పారు.
ఒంటరిగా పోటీ చేస్తే సీట్లు సాధిస్తాం కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమన్న జనసేన అధినేత పవన్ ఈ కారణంగానే పొత్తు పెట్టుకున్నట్లు వెల్లడించారు.ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
అయితే జనసేనకు సరైన సీట్లు ఇవ్వని పక్షంలో ఒంటరిగా పోటీ చేద్దామని జనసేన క్యాడర్ పవన్ కు చెప్పిందంట.అలా కాకుండా బీజేపీతో కలిసి వెళ్తే తమ పరిస్థితి ఏంటనే విషయం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
దీనిపై జనసేనాని పవన్ మాట్లాడుతూ బీజేపీ( BJP )తో కలిసి ప్రయాణం చేసినా నేతలకు, క్యాడర్ కు ఎటువంటి లోటు రానివ్వనని మాట ఇచ్చారట.అంతేకాదు అవసరం అయితే టీడీపీతో తెగదెంపులు చేసుకుని బీజేపీతో కలిసి పోటీ చేసే అవకాశం ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే అభ్యర్థుల ప్రకటనపై పవన్ రియాక్షన్, ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే సైకిల్ దిగి కమలంతో కలిసి వెళ్లాలనే భావిస్తున్నారా? అనిపిస్తుందని ఏపీ ప్రజలు అనుకుంటున్నారని తెలుస్తోంది.జనసేన అభ్యర్థుల ప్రకటనపై టీడీపీ ఎలా స్పందిస్తుంది? ఎన్నికల్లో పవన్ టీడీపీతోనే కలిసి వెళ్లారా? లేక టీడీపీ బై చెప్పి బీజేపీతో నడుస్తారా? అనేది తెలియాలంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.రాష్ట్రంలో ఓ వైపు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండగా పార్టీల మధ్య తలెత్తుతున్న ఇటువంటి ఘటనల నేపథ్యంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.