జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి మనందరికీ తెలిసిందే.మొన్నటి వరకు సినిమాలలో, బుల్లితెరపై అలరించించిన హైపర్ ఆది ఈ మధ్యకాలంలో రాజకీయాలలో కూడా ఎంట్రీ ఇచ్చాడు.
హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే.ఇక తాజాగా రణస్థలం యువశక్తి వేదికగా హైపర్ ఆది మాట్లాడిన తీరు జనసేన పార్టీ కార్యకర్తలని అలాగే జనసేన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.
దీంతో సోషల్ మీడియాలో ఆది ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడమే అనివార్యమే అంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు కొనసాగుతున్నాయి.
జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యే క్యాండిడేట్గా బరిలోకి దిగబోతున్నట్టు కూడా తెలుస్తోంది.
ఈ మేరకు జనసేన అధిష్టానం నిర్ణయం కూడా తీసుకుందట.అలాగే జనసేన అసెంబ్లీ అభ్యర్థిగా కూడా హైపర్ ఆది పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

దీంతో హైపర్ ఆదికి ఏ నియోజకవర్గం కేటాయించాలి ఎక్కడ నిలబడితే ఆదికి మంచి విజయ అవకాశాలు ఉంటాయి అన్న ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.ఇకపోతే జనసేన సమీకరణలో భాగంగా హైపర్ ఆది సొంత జిల్లా అయిన ప్రకాశం జిల్లాలోనే ఆదికి సీటును కేటాయించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.మరి ముఖ్యంగా దర్శి గిద్దలూరు నియోజకవర్గాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే గతంలో గిద్దలూరులో ప్రజారాజ్యం పార్టీ గెలుపొందింది.2009 అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ తరఫున కాపు సామాజిక వర్గానికి చెందిన అన్నా రాంబాబు అనే వ్యక్తి గెలుపొందారు.కాబట్టి హైపర్ ఆదికి గిద్దలూరు అసెంబ్లీ సీటును కేటాయించబోతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ విషయంపై ఇంకా అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.ఇకపోతే సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం నిజంగానే హైపర్ ఆది రాజకీయాలలో పాల్గొనబోతున్నాడా, బుల్లితెరకి గుడ్ బాయ్ చెప్పబోతున్నాడా అన్నది తెలియాలి అంటే అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే మరి.







