మంత్రి కన్న బాబు కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం...కారణం

ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబుకు హోంశాఖ బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించినట్లు తెలుస్తుంది.

ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల మేరకు హోం శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఏపీ వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న కన్నబాబు ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ ముఖ్యనేతల్లో ఒకరిగా కొనసాగుతున్నారు.అయితే ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలి అంటూ వారం కిందట హోం శాఖ కు ఇంటెలిజెన్స్ శాఖ నివేదిక సమర్పించడం తో ఈ నిర్ణయం తీసుకుంది.

Bullet Proof Vehicle Allots For AP Minister Kannababu In The Wake Of Intelligenc

దీనితో ఆయనకు కొత్తగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించినట్లు తెలుస్తుంది.దీనితో కన్నబాబు ఇకపై బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే ప్రయాణాలు, పర్యటనలు చేపట్టాలని నిఘా వర్గాల నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.

ఈ మేరకు మంత్రి కన్నబాబుకు సూచనలు కూడా చేసినట్లు తెలుస్తుంది.దీనితో ఇంటెలిజెన్స్ వర్గాల సూచనలను పాటించాలని నిర్ణయించుకున్న కన్నబాబు, తన తాజా పర్యటనలకు కొత్తగా కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వినియోగిస్తున్నారు.

Advertisement

మంత్రి కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించడం ఇప్పుడు రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.మరి ప్రతిపక్ష పార్టీ నేతల సెక్యూరిటీ ని కుదించుకుంటూ వచ్చిన జగన్ సర్కార్ ఇప్పుడు వారి కేడర్ మినిస్టర్ కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించడం పై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

Advertisement

తాజా వార్తలు