సుమ( Suma ) రాజీవ్ కనకాల ( Rajeev Kanakala ) కుమారుడు రోషన్ ( Roshan ) హీరోగా ప్రేక్షకులకు పరిచయమైన సంగతి మనకు తెలిసిందే.క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల సినిమాలతో మెప్పించిన దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ కనకాల బబుల్‌గమ్ సినిమాతో నేడు డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఈ సినిమాలో రోషన్ సరసన మానస చౌదరి అనే అమ్మాయి హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.మరి రోషన్ మొదటి సినిమాగా నేడు విడుదలైనటువంటి ఈ చిత్రం కథ ఏంటి ?ఈ సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంది? హీరోగా ఈయన సక్సెస్ అయ్యారా? అనే విషయాలను తెలుసుకుందాం.
కథ:
ఆది(రోషన్ కనకాల)పక్కా హైదరాబాద్ మిడిల్ క్లాస్ అబ్బాయి.ఇద్దరు ఫ్రెండ్స్ తో సరదాగా తిరుగుతూనే లైఫ్ లో పెద్ద DJ అవ్వాలని ఒక డీజే వద్ద అసిస్టెంట్ గా చేరి పనులు నేర్చుకుంటూ ఉంటారు.
జాన్వీ(మానస)( Maanasa Choudhar ) బాగా డబ్బున్న అమ్మాయి.కొన్ని నెలల్లో విదేశాలకు వెళ్ళిపోతుంది అయితే ఈమె విదేశాలకు వెళ్లిపోయే సమయంలో ఒక అబ్బాయిని బాగా ఆడుకొని తన హార్ట్ బ్రేక్ చేసి వెళ్లిపోవాలని అనుకుంటుంది ఇలా ఓ పార్టీలో ఆది డిజే పెట్టగా ఈమె అతని వద్దకు వెళ్లి చాలా అద్భుతంగా డిజే చేస్తున్నావని తనపై ప్రశంసలు కురిపిస్తూ తనకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తుంది కానీ ఆది నిజంగానే తనతో ప్రేమలో పడతాడు.
ఒకరిని బకరా చేయాలి అనుకున్నటువంటి జాన్వీ తనకు తెలియకుండానే ఆదితో సిన్సియర్ గా ప్రేమలో పడి ఇద్దరు సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
రోజు జాన్వీ బర్త్ డే పార్టీలో ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ జాన్వితో క్లోజ్ గా మూవ్ అవ్వడం చూసి ఆది తట్టుకోలేకపోతాడు.
దీంతో జాన్వీ బెస్ట్ ఫ్రెండ్ ధరణి.ఆదిని ఓదారుస్తూ ఏం చేయాలో దిక్కు తెలియక తన స్నేహితురాలు ఆదికి ముద్దు పెడుతుంది అది చూసినటువంటి జాన్వీ వారిని అపార్థం చేసుకుని అందరి ముందు ఆదిని అవమానపరుస్తుంది.
నీ ఒంటిపై ఉన్న దుస్తులు కూడా నేను కొనించినవి అంటూ ఆ బట్టలన్నీ విప్పించి తనని అవమాన పరుస్తుంది.ఆ తర్వాత ఆది ఏం చేశాడు అసలు జాన్వికి నిజం తెలుస్తుందా తిరిగి వీరిద్దరూ ఎలా కలిశారు అసలు కలుస్తారా లేదా అన్న విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల నటన:
రోషన్ ఇది తనకు మొదటి సినిమాని అయినప్పటికీ తన పాత్ర పరంగా చాలా అద్భుతంగా నటించారు.నిజంగానే హైదరాబాది మిడిల్ క్లాస్ అబ్బాయిలాగే రోషన్ నటించారని చెప్పాలి.ఇక మానస చౌదరి కూడా మొదటి సినిమా అన్న భావన లేకుండా చాలా అద్భుతంగా నటించారు.ఇక రోషన్ తండ్రి పాత్రలో కూడా చైతు జొన్నలగడ్డ అద్భుతంగా నటించారని చెప్పాలి.ఇలా ప్రతి ఒక్కరు కూడా వారి పాత్రలకు పూర్తి శాతం న్యాయం చేశారు.
టెక్నికల్:
బబుల్‌గమ్ సినిమాకు శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం ప్లస్ అయిందనే చెప్పొచ్చు.ఇలా మ్యూజిక్ హైలెట్ అయినప్పటికీ పాటలు మాత్రం పరవాలేదనిపించాయి.కెమెరా విజువల్స్ కూడా సీన్స్ కి తగ్గట్టు అందంగా చూపించారు.డైరెక్టర్ రవికాంత్ పేరెపు గతంలోనే తన సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ ఈ సినిమా కథ విషయంలో కాస్త కన్ఫ్యూషన్ అయ్యారని తెలుస్తుంది.సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగా రాసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

విశ్లేషణ:
డైరెక్టర్ ప్రేమ కథ సినిమా ద్వారా ఈ సినిమాను ప్రేక్షకులకు పరిచయం చేయాలి అన్న తపన స్పష్టంగా కనపడుతుంది అయితే ఈయన కథనం సిద్ధం చేసే సమయంలో కాస్త కన్ఫ్యూషన్ కి గురి కావడంతో అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సింక్ అవ్వలేదని తెలుస్తుంది.అంతేకాకుండా కథ కూడా చాలా స్లోగానే సాగిందని చెప్పాలి.మొత్తానికి రోషన్ తనవరకు ఈ సినిమాలో భారీగానే నటించారని చెప్పాలి.

ప్లస్ పాయింట్స్:
నటీనటుల నటన, మ్యూజిక్, అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు.
మైనస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్, సినిమా సాగదీయటం.కొన్ని సన్నివేశాలు చూసామని భావన కలగడం.
బాటమ్ లైన్:
ఈ సినిమా టైటిల్ కి అనుగుణంగానే కథ కూడా సాగుతుందని చెప్పాలి బబుల్ గమ్( Bubble Gum ) మొదట్లో తినడానికి తీయగా అనిపించినా తర్వాత చెప్పగా అనిపిస్తుంది సినిమా కూడా మొదట్లో మంచిగా ఉన్నప్పటికీ వెళ్లే కొద్ది కాస్త సాగదీసారని చెప్పాలి.







